For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Latent View Analytics IPO: మరో బ్లాక్ బస్టర్ డెబ్యూ రెడీ: గ్రే మార్కెట్ కింగ్‌

|

ముంబై: ప్రస్తుతం షేర్ మార్కెట్‌లో ఐపీఓల సందడి నెలకొంది. టాప్ బ్రాండింగ్, డేటా బేస్ అండ్ డేటా అనలిటిక్స్ కంపెనీలతో పాటు ఆన్‌లైన్ పేమెంట్ యాప్ పేటీఎం, ఫుడ్ చైన్ రెస్టారెంట్ల లీడ్ సంస్థలు పబ్లిక్ ఇష్యూలను జారీ చేశాయి. లేడీస్ బ్రాండింగ్, ఫార్మాకంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లను జారీ చేయడానికి సమాయాత్తమౌతోన్నాయి. ఈ నెలలోనే మరికొన్ని టాప్ కంపెనీలు ఐపీఓలను జారీ చేయడానికి అవసరమైన అనుమతులన్నింటినీ కూడా సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి పొందాయి.

విడిపోనున్న జాన్సన్ అండ్ జాన్సన్: రమేష్ అండ్ సురేష్ టైప్‌లో క్రేజీ టైటిల్స్విడిపోనున్న జాన్సన్ అండ్ జాన్సన్: రమేష్ అండ్ సురేష్ టైప్‌లో క్రేజీ టైటిల్స్

ల్యాటెంట్ వ్యూకు అదిరిపోయే రెస్పాన్స్..

ల్యాటెంట్ వ్యూకు అదిరిపోయే రెస్పాన్స్..

ల్యాటెంట్ వ్యూ అనలిటిక్స్ కంపెనీ జారీ చేసిన పబ్లిక్ ఇష్యూ.. టాపర్‌గా నిలిచింది. మోస్ట్ సబ్‌స్క్రైబ్డ్ ఐపీఓగా గుర్తింపు పొందింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా జారీ అయిన ఐపీఓలతో పోల్చుకుంటే ఇదే అత్యధికమని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. పబ్లిక్ ఇష్యూను జారీ చేసినప్పటి నుంచీ 12వ తేదీన గడువు ముగిసే నాటికి 339 సార్లు ఇది సబ్‌స్క్రైబ్ అయింది. ఈ సీజన్‌లో ఇదే హయ్యెస్ట్ సబ్‌స్క్రైబింగ్ అని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

339 రెట్లు.. బిడ్స్

339 రెట్లు.. బిడ్స్

ఇదివరకు పరాస్ డిఫెన్స్, ఆ తరువాత నైకా కాస్మటిక్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అత్యధికంగా సబ్‌స్క్రైబ్ అయిన ఐపీఓలుగా గుర్తింపు పొందగా.. తాజాగా ల్యాటెంట్ వ్యూ అనలిటిక్స్.. ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ కంపెనీకి 339 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. తొలి రెండురోజులు అంతంతమాత్రంగానే కనిపించినప్పటికీ.. చివరి రోజు మాత్రం ఒక్కసారిగా ఉప్పెలా బిడ్స్ దాఖలయ్యాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

 పరాస్ డిఫెన్స్ కంటే ఎక్కువగా..

పరాస్ డిఫెన్స్ కంటే ఎక్కువగా..

పరాస్ డిఫెన్స్ 304, సలాసర్ టెక్ 273, అపోలో మైక్రో 249, అస్ట్రాన్ పేపర్ 242, మిసెస్ బెక్టార్ 198 సార్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఇప్పుడు వీటన్నింటినీ దాటుకుని దూసుకెళ్లింది ల్యాటెంట్ వ్యూ అనలిటిక్స్. 339 సార్లు ఇది సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్స్ ద్వారా 26,848 కోట్ల రూపాయలు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐ) ద్వారా 78,498 కోట్ల రూపాయలు విలువ చేసే బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 7,348 కోట్ల రూపాయల బిడ్స్ అందాయి.

 1.12 వేల కోట్లకు బిడ్స్..

1.12 వేల కోట్లకు బిడ్స్..

600 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి సేకరించడానికి ల్యాటెంట్ వ్యూ అనలిటిక్స్ కంపెనీ ఐపీఓను జారీ చేయగా..

339 రెట్ల బిడ్లు దాఖలు కావడం అసాధారణమని స్పష్టం చేస్తోన్నాయి. మొత్తంగా 1.12 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బిడ్స్‌ను ఇన్వెస్టర్లు ఈ మూడు రోజుల్లో దాఖలు చేశారు. ఇది మొబైల్ పేమెంట్ యాప్ పేటీఎంకు వచ్చిన రెస్పాన్స్ కంటే ఆరు రెట్లు అధికం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గ్రే మార్కెట్ కింగ్..

గ్రే మార్కెట్ కింగ్..

ఇప్పటికే గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ఒక్కో షేరుకు 310 రూపాయలుగా అంచనా వేస్తోంది. ల్యాటెంట్ వ్యూ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 190 రూపాయల నుంచి 197 రూపాయలు కాగా.. గ్రే మార్కెట్ ప్రీమియం 310 రూపాయలుగా నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డేటా అనలిటిక్స్, కన్సల్టింగ్, బిజినెస్ అనలిటిక్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, డేటా ఇంజినీరింగ్, డిజిటల్ సొల్యూషన్స్ సెగ్మెంట్‌కు చెందిన కంపెనీ కావడం వల్లే దీనికి ఇంత డిమాండ్ ఏర్పడిందనే అంచనాలు ఉన్నాయి.

English summary

Latent View Analytics IPO: మరో బ్లాక్ బస్టర్ డెబ్యూ రెడీ: గ్రే మార్కెట్ కింగ్‌ | Latent View Analytics tops charts with 339 times subscription, receives bids worth Rs 1.1 trn

Data analytics firm Latent View Analytics’ maiden offering, which ended on Friday, garnered 339 times subscription, making it the most-subscribed initial public offering ever.
Story first published: Saturday, November 13, 2021, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X