For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివరి గంటలో సెన్సెక్స్ జంప్, భారీ నష్టాల నుండి లాభాల్లోకి...

|

ముంబై: ఆద్యంతం భారీ నష్టాల్లో కదలాడిన స్టాక్ మార్కెట్లు చివరి గంటలో ఎగిసిపడటంతో లాభాల్లో ముగిశాయి. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో మధ్యాహ్నం గం.3 వరకు అదే ఒరవడి కొనసాగింది. చివరి అరగంటలో మాత్రం లాభాల్లోకి వచ్చింది. ఇటీవల స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. నేడు కీలక రంగాల షేర్ల కొనుగోళ్ల మద్దతుతో రెండో రోజు లాభాలు నమోదు చేసింది. భారత్‌లో కరోనా వ్యాక్సీన్ కొరతను అధిగమించేందుకు విదేశీ టీకాలకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో గత సెషన్‌లో జోరుగా సాగిన సూచీలు, నేడు అదే ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. అయితే అంతలోనే నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, తిరిగి లాభాల్లో ముగిశాయి.

భారీ నష్టాల నుండి లాభాల్లోకి

భారీ నష్టాల నుండి లాభాల్లోకి

సెన్సెక్స్ నిన్న 48,544 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 48,512.77 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,887.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,010.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 259.62 (0.53%) పాయింట్లు లాభపడి 48,803.68 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,522.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,597.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,353.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 76.65 (0.53%) పాయింట్లు ఎగిసి 14,581.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం నుండి సాయంత్రం వరకు నష్టాల్లోనే ఉన్నప్పటికీ, చివరి అరగంటలో లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్ 3.70 శాతం, సిప్లా 3.28 శాతం, ఓఎన్జీసీ 2.99 శాతం, విప్రో 2.80 శాతం, అదాని పోర్ట్స్ 2.64 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 3.26 శాతం, గ్రాసీమ్ 3.09 శాతం, ఇన్ఫోసిస్ 2.61 శాతం, మారుతీ సుజుకీ 2.52 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 2.17 శాతం నష్టపోయాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు, టాటా మోటార్స్, ICICI బ్యాంకు, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.53 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.53 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 1.29 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.18 శాతం, నిఫ్టీ మీడియా 0.66 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.38 శాతం నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 1.07 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.62 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.17 శాతం, నిఫ్టీ ఐటీ 0.62 శాతం, నిఫ్టీ మెటల్ 1.37 శాతం, నిఫ్టీ ఫార్మా 1.40 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.82 శాతం లాభపడ్డాయి.

English summary

చివరి గంటలో సెన్సెక్స్ జంప్, భారీ నష్టాల నుండి లాభాల్లోకి... | Last hour surge lifts Sensex, Nifty on weekly expiry day

A smart recovery in the last hour of trade, primarily driven by buying in metal and pharma stocks, helped BSE Sensex and Nifty 50 to end near day’s high on weekly expiry day. BSE Sensex ended up 260 points or 0.53 per cent at 48,804, while the broader Nifty 50 settled at 14,481.
Story first published: Thursday, April 15, 2021, 18:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X