For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎం కేర్స్ ఫండ్‌కు లక్ష్మీమిట్టల్ రూ.100 కోట్లు, టిక్‌టాక్ మాస్క్‌లు, సూట్స్

|

కరోనాపై పోరుకు ఎన్నారై బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ రూ.100 కోట్లు ఇచ్చారు. ఈ మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌లోని ప్రజలంతా అంకితభావం, ధైర్యం, కరుణ చూపిస్తున్నారని, వారికి మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అలజడి సృష్టిస్తోందని మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో పరస్పర సహకరం అవసరమని పేర్కొన్నారు.

టాటా నుండి అంబానీ వరకు కరోనాపై పోరుకు భారీ విరాళాలు, ధరలూ తగ్గించారుటాటా నుండి అంబానీ వరకు కరోనాపై పోరుకు భారీ విరాళాలు, ధరలూ తగ్గించారు

ఉచిత భోజనం..

ఉచిత భోజనం..

ప్రభుత్వాలు, కంపెనీలు, పౌరులు తమ వనరులను సమకూర్చుకోవడానికి కలిసి పని చేయాలని మిట్టల్ తన ప్రకటనలో తెలిపారు. మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా పారద్రోలే చర్యలు తీసుకుంటారని విశ్వసించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ కంపెనీలో ప్రతి రోజుకు 5,000 మందికి ఉచిత భోజనం, 30,000 మందికి పైగా ఫుడ్ కిట్స్ అందిస్తున్నట్లు తెలిపారు.

మెర్సిడెజ్ బెంజ్ సహకారం

మెర్సిడెజ్ బెంజ్ సహకారం

పుణేలో కరోనా మహమ్మారి బాధితులకు కోసం 1,500 పడకలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని నిర్మిస్తామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ప్రకటించింది. సంస్థలో ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారని తెలిపింది. వైద్య పరికరాల కోసం రూ.100 కోట్ల విరాళమిచ్చింది.

టిక్‌టాక్ రక్షణ సూట్స్

టిక్‌టాక్ రక్షణ సూట్స్

వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సూట్స్, మాస్క్‌లు అందిస్తామని టిక్‌టాప్ యాప్ ప్రకటించింది. రూ.100 కోట్ల 4 లక్షల ప్రొటెక్టివ్ సూట్స్, మాస్కులు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అందిస్తామని, ఇప్పటికే రెండు లక్షల మాస్కులను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు అందించామని తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి కుటుంబం అక్షయపాత్ర ఫౌండేషన్‌కు రూ.10 కోట్ల విరాళం ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఇదివరకే రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. జిందాల్ అల్యూమినియం రూ. 5 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌కు అందించింది.

English summary

పీఎం కేర్స్ ఫండ్‌కు లక్ష్మీమిట్టల్ రూ.100 కోట్లు, టిక్‌టాక్ మాస్క్‌లు, సూట్స్ | Lakshmi Mittal announces Rs 100 crore to PM CARES Fund

NRI billionaire Lakshmi N Mittal on Tuesday announced a contribution of Rs 100 crore to the PM CARES Fund to combat the spread of the deadly coronavirus in India.
Story first published: Thursday, April 2, 2020, 8:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X