For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదో ఇన్వెస్టర్‌తో రూ.1,04,327 కోట్లు: జియోలో అంబానీ ఎంత విక్రయించారంటే?

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే రూ.6,441 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థ టీపీజీ రూ.4,546.80 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించిన కొద్దిసేపటికే మరో సంస్థ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఎల్-కేటర్టన్ రూ.1,894.50 కోట్లు రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

జియోలోకి 7 వారాల్లో 9వ పెట్టుబడి, రూ.4,547 కోట్లతో TPG 0.9% వాటాజియోలోకి 7 వారాల్లో 9వ పెట్టుబడి, రూ.4,547 కోట్లతో TPG 0.9% వాటా

పదో పెట్టుబడితో రూ.1,04,327 కోట్లు

పదో పెట్టుబడితో రూ.1,04,327 కోట్లు

రూ.4.91 లక్షల కోట్ల ఈక్విటి వ్యాల్యూ, రూ.5.16 లక్షల కోట్ల ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూ వద్ద ఈ పెట్టుబడులు వచ్చాయి. జియోలో టీపీజీ 0.93 శాతం వాటాను కొనుగోలు చేస్తుండగా, ఎల్-కేటర్టన్ 0.39 శాతం వాటాను దక్కించుకుంటోంది. ఈ పదో పెట్టుబడితో రిలయన్స్ జియోలోకి రూ.1,04,326.90 కోట్లు వచ్చాయి.

ఇదీ ఎల్-కాటర్టన్

ఇదీ ఎల్-కాటర్టన్

ఎల్-కాటర్టన్ ప్రపంచవ్యాప్తంగా కన్స్యూమర్ కేంద్రీకృత బ్రాండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది. 30 ఏళ్లుగా సంవత్సరాలుగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. పెట్టుబడుల ద్వారా కొన్ని వినూత్న బ్రాండ్స్‌ను ముందు నిలపడానికి ఎల్-కాటర్టన్ తోడ్పడింది. పెలోటోన్, వ్రూమ్, క్లాస్‌పాస్, ఓన్‌డేస్, ఫ్యాబ్ఇండియా వంటి వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టింది. ఈ ప్రయివేట్ ఈక్విటీ దిగ్గజం (PE giant) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేసింది.

22.38 శాతం వాటా విక్రయించిన జియో

22.38 శాతం వాటా విక్రయించిన జియో

ఇప్పటి వరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో 22.38 శాతం వాటాను విక్రయించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ వాటా విక్రయాల ద్వారా రూ.1,04,326.90 కోట్లు సమీకరించింది. ఏప్రిల్ 22న ఫేస్‌బుక్ - జియో డీల్‌తో ఈ పెట్టుబడుల రాకడ ప్రారంభమైంది. జియో ప్లాట్‌ఫాంలో మరో ఏడు నుండి 8 శాతం విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా

- సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా

- విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా

- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా

- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా

- ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా

- TPG - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా

- ఎల్-కేటర్టన్ - రూ.1,894.50 కోట్లు - 0.39 శాతం వాటా

English summary

పదో ఇన్వెస్టర్‌తో రూ.1,04,327 కోట్లు: జియోలో అంబానీ ఎంత విక్రయించారంటే? | L Catterton becomes 10th investor in Jio Platforms in historic fundraising by RIL unit

L Catterton, the world’s largest consumer-focused private equity firm, will invest Rs 1,894.50 crore for a 0.39 percent stake.
Story first published: Sunday, June 14, 2020, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X