For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండస్ఇండ్ బ్యాంకుపై కొటక్ మహీంద్ర కన్ను?

|

హిందూజా గ్రూప్ సంస్థకు చెందిన ఇండస్ఇండ్ బ్యాంకుపై ప్రయివేటురంగ కొటక్ మహీంద్రా బ్యాంకు దృష్టి సారించింది. షేర్ల మార్పిడి ద్వారా ఒప్పందం కుదుర్చుకునే వీలుందని వార్తలు వచ్చాయి. సంయుక్త సంస్థలో ఇండస్ఇండ్ బ్యాంకు ప్రమోటర్లు హిందూజా గ్రాప్ కొంతమేర వాటాలు తీసుకోనునన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై కొటక్ మహీంద్రా బ్యాంకు స్పందించాల్సి ఉంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఇండస్ ఇండ్ బ్యాంకు సీఈవో సుమంత్ తెలిపారు. బ్యాంకు యాజమాన్యం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందన్నారు.

కొటక్ మహీంద్ర బ్యాంకు వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కొటక్ మొత్తం స్టాక్‌ను అక్వైర్ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని, అయితే చర్చలు ప్రయివేటుగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఒప్పందం తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంకు వ్యవస్థాపకులు సంయుక్త బ్యాంకులో కొంత వాటాను నిలుపుకుంటారని, ఈ మేరకు ఉదయ్ కొటక్, హిందూజా గ్రూప్ మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

ట్యాక్స్‌పేయర్స్‌కు ఊరట, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపుట్యాక్స్‌పేయర్స్‌కు ఊరట, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు

Kotak Mahindra explores takeover of IndusInd bank

ఈ ఒప్పందం వాస్తవరూపం దాలిస్తే ప్రముఖ ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటిగా కొటక్ మహీంద్రా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. ఆస్తులను 83 శాతం మేర పెరగనున్నాయి. మరోవైపు ఇండస్ ఇండ్ బ్యాంకుకు ఇది లైఫ్ లైన్ అవుతుంది. ఈ ఏడాది ఇండస్ ఇండ్ బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ 60 శాతం మేర క్షీణించి 6 బిలియన్ డాలర్లకు క్షీణించింది. కొటక్ మహీంద్రా 2014లో ఐఎన్‌జీ గ్రూప్‌ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 11.2 బిలియన్ డాలర్ల విలువైన హిందుజా గ్రూప్‌లోని సోదరుల మధ్య విభేధాల నేపథ్యంలో బ్యాంక్ విక్రయానికి చర్చలు ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి.

English summary

ఇండస్ఇండ్ బ్యాంకుపై కొటక్ మహీంద్ర కన్ను? | Kotak Mahindra explores takeover of IndusInd bank

Kotak Mahindra Bank Ltd., backed by Asia’s richest banker, is exploring a takeover of smaller Indian rival IndusInd Bank Ltd., people with knowledge of the matter said, a move that would create the nation’s eighth-largest financial firm by assets.
Story first published: Monday, October 26, 2020, 11:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X