For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ITR Filing: వీరు గడువు తరువాత ITR దాఖలు చేసినా NO పెనాల్టీ.. పూర్తి వివరాలు ఇవే..

|

ITR Filing: ఆదాయపుపన్ను చెల్లింపుకు గడువు పూర్తయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంత మంది పన్ను చెల్లింపుదారులకు మాత్రం గడువు తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేసినా ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదనే విషయం మీకు తెలుసా? ఒక వేళ మీరు ఈ కేటగిరీలో ఉన్నట్లయితే వెంటనే ఐటీఆర్ ఫైలింగ్ చేసి ప్రయోజనాన్ని పొందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ముగిసిన గడువు.. కానీ

ముగిసిన గడువు.. కానీ

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. గడువు తేదీ తర్వాత ITRని ఫైల్ చేస్తున్నట్లయితే రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. గడువు తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడంలో విఫలమైనప్పటికీ ఈ జరిమానా విధించబడని కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొంత మంది మాత్రం ఎటువంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు.

పెనాల్టీ లేని సందర్భాలు ఇవే..

పెనాల్టీ లేని సందర్భాలు ఇవే..

మదింపుదారుడి మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిలో ఉంటే ఎటువంటి జరిమానా విధించబడదు. కొత్త విధానం ప్రకారం.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుకు ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు, అయితే.. పాత పన్ను విధానంలో మినహాయింపు పరిమితి పన్ను చెల్లింపుదారుల వయస్సుపై ఆధారపడి ఉండేది.

 వయస్సు ఆదాయంగా..

వయస్సు ఆదాయంగా..

పాత పన్ను విధానం ప్రకారం 60 ఏళ్ల వయస్సు వరకు పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షలుగా ఉండేది. 60-80 ఏళ్ల మధ్య రూ.3 లక్షల ఆదాయం ఉన్న సీనియర్ సిటిజన్లకు మినహాయింపు కేటగిరీ కిందకు వస్తారు. 80 ఏళ్లు పైబడిన వారికి, సూపర్ సీనియర్ సిటిజన్లకు మినహాయింపు పరిమితి రూ.5 లక్షలు.

ఎవరెవరు తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి..

ఎవరెవరు తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి..

1. పన్ను చెల్లింపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లేదా సహకార బ్యాంకులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో మొత్తం రూ.కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేసినట్లయితే ITR ఫైల్ చేయడం తప్పనిసరి.

2. ఒక వ్యక్తి తన కోసం రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే లేదా ఎవరైనా విదేశాలకు వెళ్లడానికి ITR ఫైల్ చేయవలసి ఉంటుంది.

3. ఒక సంవత్సరంలో రూ.లక్ష కంటే ఎక్కువ విద్యుత్ బిల్లులు చెల్లించిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు కూడా ITR దాఖలు చేయడం తప్పనిసరి.

ఈ షరతులలో ITR ఫైల్ చేయడానికి అవసరమైన వ్యక్తులు తప్పనిసరిగా గడువుకు కట్టుబడి ఉండాలి. పైన పేర్కొన్న మూడు క్యాటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు గడువు లోపు ITR ఫైల్ చేయకపోతే జరిమానా విధించబడతారు.

English summary

ITR Filing: వీరు గడువు తరువాత ITR దాఖలు చేసినా NO పెనాల్టీ.. పూర్తి వివరాలు ఇవే.. | know who can file income tax return after due date without any penalty

These Taxpayers Need Not Pay Penalty For ITR Filing After Due Date
Story first published: Thursday, August 11, 2022, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X