For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ratan Tata: 84 ఏళ్ల వయస్సులోనూ అదే నిబద్ధత.. రతన్ టాటా మాటలే ప్రేరణ.. వీడియో వైరల్..

|

Ratan Tata: రతన టాటా ఇదొక పేరు కాదు వ్యాపార ప్రపంచంలో ఒక బ్రాండ్. నిబద్ధతకు నిలువెత్తు రూపంగా కనిపించే టాటా చేతలు అనితర సాధ్యం. 84 ఏళ్ల వయస్సులోనూ తనకు నిజంగా సంతోషాన్ని ఇచ్చే విషయం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

టాటాల సామ్రాజ్యంలో..

టాటాల సామ్రాజ్యంలో..

టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అయినప్పటికీ రతన్ టాటా అందరికీ చేరువయ్యారు. ఆయన అంత ప్రసిద్ధి చెందటానికి ప్రధాన కారణంగా ఆయన ప్రేరణాత్మక మాటలతో పాటు కొటేషన్స్. పైగా సంపదను తిరిగి సమాజానికి ఉపయోగపడే విధంగా తిరిగి ఖర్చు చేయటంలో టాటాల తర్వాతే ఎవరైనా. అందుకే వారు లెజెండ్స్ అని చెప్పుకోవాలి.

హర్ష్ గోయెంకా ట్వీట్..

ఇటీవల రతన్ టాటా ఒక ప్రసంగంలో మాట్లాడుతూ తనను నిజంగా ఉత్తేజ పరిచేది లేదా తనకు గొప్ప ఆనందాన్ని కలిగించినదాని గురించి వివరించారు. 84 ఏళ్ల వయస్సులో ఆయన చురుకుదనాన్ని RPG ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా మెచ్చుకున్నారు. టాటా ప్రసంగానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో టాటా మాట్లాడుతూ.. "అందరూ 'చేయలేము' అని చెప్పే పనిని చేయడానికి ప్రయత్నించడంలో నేను గొప్ప ఆనందాన్ని పొందుతున్నాను" అని అన్నారు.

వైరల్ అయిన వీడియో..

వైరల్ అయిన వీడియో..

ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోపై అనేక మంది తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. టాటా నానో ప్రయాణం గురించి మాట్లాడుతూ.. రూ.లక్ష ధరకు ప్యాసింజర్ కారును తయారు చేయటం ఒక సాహసమని, అది కుదరదని పరిశ్రమ రతన్ టాటాకు చెప్పింది. అయితే మధ్య తరగతి వారికి కారును అందించాలనే ఆయన కోరికతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దీనిపై చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. దేవుడు ఆయనకు తోడుంటారు, భూమిపైన ఆయన ఆత్మ సూపర్ పవర్స్ కలిగి ఉంది అంటున్నారు. ఆయన నైతికతపై కూడా ప్రశంసలు వస్తున్నాయి.

స్టార్టప్ పెట్టుబడులు..

స్టార్టప్ పెట్టుబడులు..

తాను నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని సుసాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తానని టాటా అంటుంటారు. ఇలా అనేక క్షిష్టమైన పనులను విజయవంతంగా చేసి చూపించి తానంటే ఏమిటో నిరూపించుకున్నారు కూడా. అలా యువతరం ఆలోచనలకు మద్ధతును కూడా అందించారు. ఈ క్రమంలో Ola Electric, Paytm, Cardekho, Snapdeal, Curefit, Jivame, Urban Company, Lenskart వంటి స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు సైతం పెట్టారు. మరిన్ని విభిన్న కంపెనీల్లో పెట్టుబడులను పెడుతూనే ఉన్నారు.

రతన్ టాటా ఫేమస్ కొటేషన్స్..

రతన్ టాటా ఫేమస్ కొటేషన్స్..

* మనం ముందుకు సాగటానికి జీవితంలో ఎత్తుపల్లాలు చాలా కీలకం, ఈసీజీలో గీత సాధారణంగా ఉంటే జీవం లేనట్లని అర్థం. జీవితం కూడా అంతే.

* వెగంగా ముందుకెళ్లాలంటే ఒంటరిగా వెళ్లు, అదే చాలా దూరం ప్రయాణించాలంటే మరొకరితో కలిసి వెళ్లు.

* జనం నీపై విసిరే రాళ్లతో అందమైన ఇల్లు కట్టుకో.

* ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు దానికి ఉన్న తుప్పు తప్ప. అలాగే మనిషిని ఎవ్వరూ నాశనం చేయలేరు అతని మెదడు తప్ప.

English summary

know what ratan tata said about his greatest pleasure video tweeted by harsh goenka going viral

know what ratan tata said about his greatest pleasure video tweeted by harsh goenka going viral
Story first published: Tuesday, September 27, 2022, 12:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X