For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

AP Budget 2023: పేదలు-బలహీన వర్గాలకు బడ్జెట్ పెద్దపీట.. రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్..

|

AP Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్లో ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చిందని ఆయన వెల్లడించారు. విద్య, వైద్యం, సంక్షేమం వంటి కీలక రంగాలకు కేటాయింపులు అత్యధికంగా ఉన్నాయి.

 రంగాల వారీగా కేటాయింపులు..

రంగాల వారీగా కేటాయింపులు..

ఏపీ ప్రభుత్వం వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులను గమనిస్తే.. పెన్షన్లకు రూ.2,1434 కోట్లు, రైతు భరోసాకు రూ.4,020కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ.2,842 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.2,200కోట్లు, వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ.700 కోట్లు, డీబీటీ స్కీముల కోసం 54,228.36 కోట్లను కేటాయించింది.

 మహిళల కోసం..

మహిళల కోసం..

రాష్ట్రంలోని మహిళల కోసం ఏర్పాటు చేస్తున్న అనేక పథకాలకు సైతం కీలక కేటాయింపులను జగన్ సర్కార్ ప్రకటించింది. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలకు రూ.300 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్లు, కాపు నేస్తంకు రూ.550 కోట్లు, జగనన్న చేదోడుకి రూ.350 కోట్లు, వాహన మిత్ర రూ.275 కోట్లు, నేతన్న నేస్తానికి రూ.200 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.125 కోట్లు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీకి రూ.50 కోట్లు, రైతులకు నష్టపరిహారానికి రూ.20 కోట్లు, లా నేస్తానికి రూ.17 కోట్లు, జగనన్న తోడుకు రూ.35 కోట్లు, ఈబీసీ నేస్తానికి రూ.610 కోట్లు, వైఎస్ఆర్ కళ్యాణమస్తుకు రూ.200 కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకు రూ.6,700 కోట్లు, వైఎస్ఆర్ చేయూతకు రూ.5,000 కోట్లు, అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన కేటాయించారు.

వైద్యారోగ్యం సంక్షేమానికి..

వైద్యారోగ్యం సంక్షేమానికి..

ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్న ఏపీ ప్రభుత్వం దానికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులను చేసింది. వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.15,882 కోట్లు అందించింది. కాపు సంక్షేమానికి రూ.4,887 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.4,203 కోట్లు, మన బడి నాడు నేడుకు రూ.3,500 కోట్లు, పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి రూ.5,600 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యానికి రూ.2,602 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.9,118 కోట్లు, నీటి వనరుల అభివృద్ధికి రూ.11,908 కోట్లు, పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతికత శాఖకు రూ.685 కోట్లు, ఎనర్జీ రంగానికి రూ.6,456 కోట్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖకు రూ.3,858 కోట్లు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రూ.532 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లను ఏపీ సర్కార్ తన నూతన బడ్జెట్లో కేటాయించింది.

English summary

AP Budget 2023: పేదలు-బలహీన వర్గాలకు బడ్జెట్ పెద్దపీట.. రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్.. | Know latest 2023-24 budget allocations by AP Government to various sectors and schemes

Know latest 2023-24 budget allocations by AP Government to various sectors and schemes
Story first published: Thursday, March 16, 2023, 11:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X