For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Home Loan EMI: ఒక్క శాతం వడ్డీ పెరిగితే హోమ్ లోన్ EMI ఇంత పెరుగుతుందా..? సొంతింటి కల ఖరీదైంది..

|

Home Loan EMI: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను విడతల వారీగా పెంచుతోంది. సెప్టెంబర్ మాసంలో కూడా ఇదే రిపీట్ అవుతుందని ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలో లోన్స్ తీసుకున్న అనేక మందిలో ఆందోళన ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా హౌసింగ్ లోన్ ఉన్న వారిపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అసలు ఒక్క శాతం వడ్డీ రేటు పెరిగితే.. EMI ఎంత పెరుగుతుందో ఇప్పుడు గమనిద్దాం..

 గృహ రుణాలకు తగ్గిన డిమాండ్..

గృహ రుణాలకు తగ్గిన డిమాండ్..

గత కొన్ని నెలలుగా పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది హౌసింగ్ లోన్ ఉన్నవారే. దీని వల్ల గృహ రుణాల కోసం దరఖాస్తుదారుల సంఖ్య భారీగా తగ్గింది. దీనివల్ల స్వల్పకాలంలో ఇళ్ల క్రయవిక్రయాలు దెబ్బతింటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును తగ్గిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు. పెరుగుతున్న EMI భారాన్ని మోయలేక.. వడ్డీ రేట్లు మళ్లీ ఎప్పుడు తగ్గుతాయనే ఆందోళనలో ఉన్నారు.

ఫ్లోటింగ్ రేటు కారణంగా..

ఫ్లోటింగ్ రేటు కారణంగా..

హోమ్ లోన్స్ పై బ్యాంకులు ఫ్లోటింగ్ రేటును అమలు చేస్తుంటాయి. అంటే RBI వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేసినా వాటికి అనుగుణంగా లోన్ రేట్లు కూడా మారతాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు వడ్డీ రేట్లు పెంచటం కారణంగా సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం ఉన్న షరతులకు లోబడి ఈ లోన్‌లు త్రైమాసిక పద్ధతిలో సవరించబడినందున ఫ్లోటింగ్ లోన్‌లతో ఉన్న ప్రస్తుత లోన్ తీసుకున్న వారి నెలవారీ EMI ఆటోమెటిక్ గా పెరుగుతుందని అర్బన్ మనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, అమిత్ ప్రకాష్ సింగ్ తెలిపారు.

ఒక్కశాతం వడ్డీ పెరిగితే.. ప్రభావం..

ఒక్కశాతం వడ్డీ పెరిగితే.. ప్రభావం..

హోమ్ లోన్ వడ్డీ రేట్లలో 1 శాతం పెరుగితే.. ప్రతి రూ.లక్ష లోన్ పై EMI నెలకు రూ. 60-70 వరకు పెరిగే అవకాశం ఉందని సింగ్ తెలిపారు. అంటే.. ఒక వ్యక్తికి రూ.30 లక్షల లోన్ ఉన్నట్లయితే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ దాదాపు రూ.1,800- 2,100 పెరుగుతుంది. అయితే నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ రేట్లు తగ్గవచ్చని తెలుస్తోంది. గత మూడు నెలల్లో వడ్డీ రేట్లను సెంట్రల్ బ్యాంక్ 1.4 శాతం పెంచింది.

English summary

Home Loan EMI: ఒక్క శాతం వడ్డీ పెరిగితే హోమ్ లోన్ EMI ఇంత పెరుగుతుందా..? సొంతింటి కల ఖరీదైంది.. | know how rbi interest rate hike impact and increase Home Loan EMI making it burden

Home Loan Interest Rates Impact 1% hike increases your EMI burden by this amount
Story first published: Wednesday, August 24, 2022, 17:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X