For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Microsoft: ఆపిల్ కంపెనీని దివాలా నుంచి కాపాడిన మైక్రోసాఫ్ట్.. ఎప్పుడో ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి..

|

Apple: బడా కంపెనీలకు సైతం సంక్షోభాలను ఎదుర్కొన్న సందర్భాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ అయిన్ ఆపిల్ కంపెనీ దివాలా అంచుకు చేరుకున్న సమయంలో మైక్రోసాఫ్ట్ ఆదుకుంది. అవును ఇది అక్షరాలా నిజం. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ఆదుకున్న మైక్రోసాఫ్ట్..

ఆదుకున్న మైక్రోసాఫ్ట్..

ఆగష్టు 6, 1997న బిల్ గేట్స్ దివాలా నుంచి ఆపిల్‌ను రక్షించారు. రెండు టెక్ దిగ్గజాల మధ్య జరిగిన ఈ చారిత్రక పరస్పర సహకారం. ఆ సమయంలో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కంపెనీ చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో యాపిల్ గెలవాలన్నా, తిరిగి నిలబడాలన్నా మైక్రోసాఫ్ట్ ఓడిపోవాలని చాలా మంది భావించిన విషయాన్ని జాబ్స్ గుర్తుచేసుకున్నారు. కానీ అంతా వారి ఆకాంక్షకు పూర్తి విరుద్ధంగా ఉంది.

సంక్షోభంలో సహాయం..

సంక్షోభంలో సహాయం..

అయితే స్టీవ్ జాబ్స్ అభిప్రాయం ప్రకారం.. యాపిల్ మైక్రోసాఫ్ట్‌ను ఓడించాల్సిన అవసరం లేదు. ఆపిల్ ఎవరో గుర్తుంచుకోవాలి ఎందుకంటే అందరూ ఆపిల్ ఎవరో మర్చిపోయారని అప్పట్లో ఆయన అన్నారు. అటువంటి సంక్షోభ సమయంలో బిల్ గేట్స్ ఆపిల్ కంపెనీలో 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం పూర్తి వ్యాపార నమూనాను మార్చేసింది.

లాభపడిన మైక్రోసాఫ్ట్..

పెట్టుబడి నిర్ణయం మైక్రోసాఫ్ట్ కంపెనీకి మంచి లాభాలను ఆర్జించిపెట్టింది. ఇది నిజంగా చాలా బాగా పనిచేసింది. మైక్రోసాఫ్ట్ 2003 నాటికి స్టాక్‌ను తిరిగి Appleకి విక్రయించింది. 1997లో మాక్‌వరల్డ్ బోస్టన్ సదస్సులో జాబ్స్ రెండు కంపెనీల మధ్య ఈ పెట్టుబడి సహకారం గురించి వెల్లడించినప్పుడు టెక్ పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

 పోటీ కొనసాగిస్తూనే..

పోటీ కొనసాగిస్తూనే..

నిజానికి రెండు కంపెనీలు తమ పోటీని కొనసాగిస్తూనే సహకారం అందించుకోవటం పెద్ద సంచలనంగా మారింది. గేట్స్ కు జాబ్స్ స్వయంగా కృతజ్ఞతతో స్పందించారు. టైమ్ మ్యాగజైన్ కవర్‌పై "బిల్, ధన్యవాదాలు. ప్రపంచం మెరుగైన ప్రదేశం" పేరుతో ప్రచురితం అయింది. రెండు సంస్థల మధ్య పోటీ గౌరవంతో కొనసాగటాన్ని అందరూ ప్రశంశించారు.

English summary

Microsoft: ఆపిల్ కంపెనీని దివాలా నుంచి కాపాడిన మైక్రోసాఫ్ట్.. ఎప్పుడో ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.. | know how microsoft saved Apple in august 1997 from bankruptcy with its investment in company

In August 1997, Microsoft invested $150 million in Apple, saved it from bankruptcy
Story first published: Monday, August 8, 2022, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X