For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు HDFC క్రెడిట్ కార్డ్ ఉందా..? అయితే మారుతున్న ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి..

|

HDFC Credit Card: ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ వినియోగిస్తిన్నట్లయితే ఈ వార్త తప్పనిసరిగా మీకోసమే. అయితే బ్యాంక్ ఇప్పటికే ఈ విషయాన్ని కస్టమర్లకు ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది.

జనవరి 1 నుంచి..

జనవరి 1 నుంచి..

బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డ్పాయింట్ ప్రోగ్రామ్, ఫీజ్ స్ట్రక్చర్ మార్చబోతున్నట్లు వెల్లడించింది. క్రెడిట్ కార్డుల్లో రానున్న ఈ మార్పులు జనవరి 1, 2023 నుంచి అమలవుతాయని వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకారం థర్డ్ పార్టీ మర్చంట్ ద్వారా అద్దె చెల్లింపుపై విధించే రుసుముల్లో మార్పు జరగనుంది. కొత్త సంవత్సరం నుంచి ఇంటువంటి లావాదేవీలపై 1 శాతం రుసుమును వసూలు చేయాలని బ్యాంక్ నిర్ణయించింది.

విదేశాల్లో కార్డును వినియోగిస్తే..

విదేశాల్లో కార్డును వినియోగిస్తే..

హెచ్జీఎఫ్సీ క్రెడిట్ కార్డు కస్టమర్లు విదేశాల్లో ఉన్న దుకాణంలో లేదా ఆన్‌లైన్‌లో లేదా భారతదేశంలోని వ్యాపారి విదేశాల్లో లింక్ చేయబడిన ప్రదేశంలో రూపాయల్లో చెల్లింపు చేస్తే.. దానిపై 1 శాతం ఛార్జ్ వసూలు చేస్తామని బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వీటికి తోడు బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ సిస్టమ్‌ను కూడా కొత్త సంవత్సరం నుంచి మార్చుతోంది.

రివార్డ్ పాయింట్స్..

రివార్డ్ పాయింట్స్..

కొత్త ఏడాది నుంచి క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ అందించే విధానంలో కూడా మార్పు తీసుకురావడానికి బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. వివిధ కార్డ్‌లకు రివార్డ్ సిస్టమ్ భిన్నంగా ఉంటుంది. మీరు ఛార్జీల కోసం చెల్లించడానికి, విమానాలు, హోటల్స్ వంటి బుకింగ్‌లు చేయడానికి లేదా వోచర్‌లను కొనుగోలు చేయడానికి ఈ రివార్డ్ పాయింట్లను ఉపయోగించవచ్చు. రివార్డ్ పాయింట్ల ద్వారా కస్టమర్లను ప్రోత్సహిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. క్రెడిట్ కార్డులను సరైన మార్గంలో వినియోగిస్తే.. అవి రివార్డులతో పాటు మరిన్ని ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.

English summary

మీకు HDFC క్రెడిట్ కార్డ్ ఉందా..? అయితే మారుతున్న ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. | Know changing HDFC Credit card rules from january 2022 fro charges to reward points

Know changing HDFC Credit card rules from january 2022 from charges to reward points
Story first published: Sunday, December 4, 2022, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X