For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

High Paid IT Jobs: 2022లో అధిక జీతాలు ఈ స్కిల్స్ ఉన్న టెక్కీలకే.. మీకూ ఈ నైపుణ్యాలు ఉన్నాయేమో తెలుసుకోండి..

|

High Paid IT Jobs: ఐటీ రంగంలో కొత్త టెక్నాలజీలు, కొత్త సాఫ్ట్ వేర్లకు డిమాండ్ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. అలా 2022లో కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్న టెక్కీలకు కంపెనీలు భారీగా వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సెక్టార్ లో భారతీయ ఉద్యోగులకు ఎక్కువ డిమాండ్ ఉంది. పైగా అధిక వేతనాలు ఆశిస్తున్న ప్రస్తుత యువత ఈ రంగంలో ఉపాధి కోసం తీవ్రంగా కృషి చేస్తోంది.

కరోనా తరువాత పెరిగిన అవకాశాలు..

కరోనా తరువాత పెరిగిన అవకాశాలు..

కరోనా తరువాత అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ వేగవంతం కావటంతో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు సైతం భారీగానే పెరిగాయి. అయితే.. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల‌ను నేర్చుకుంటున్న వారికి సులువుగా కొలువులు వస్తున్నాయి. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న స్కిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌:

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌:

కంపెనీలకు అవసరమైన ఏఐ సాంకేతికలను అభివృద్ధి చేసి, వాటి పనితీరును పర్యవేక్షించటం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్‌ బాధ్యత. ఇందుకోసం అతనికి స్టాటిస్టిక్స్‌, గ‌ణితంలో మంచి ప‌ట్టు అవసరం ఉంటుంది. ఆర్కిటెక్ట్ ప్రోగ్రామింగ్ తో పాటు పైథాన్‌, ఆర్ వంటి ఇతర సాంకేతిక నైపుణ్యాలు తప్పక కలిగి ఉండాలి. ఈ నైపుణ్యాలు కలిగి ఉన్న నిపుణులకు మార్కెట్లో ఏడాదికి అత్యధికంగా రూ.80 లక్షల వరకు వేతనాన్ని అందించేందుకు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.

ఫుల్‌స్టాక్ డెవ‌ల‌ప‌ర్ :

ఫుల్‌స్టాక్ డెవ‌ల‌ప‌ర్ :

ఫుల్‌స్టాక్ డెవ‌ల‌ప‌ర్ల‌కు ఉద్యోగ అవ‌కాశాలు మార్కెట్లో భారీగానే ఉన్నాయి. ప్రోగ్రామింగ్‌లో ప‌ట్టుతో పాటు కాన్సెప్ట్ నుంచి ఫినిష్డ్ ప్రోడ‌క్ట్ వ‌ర‌కూ అవగాహన తప్పనిసరి. ఈ సాంకేతిక స్కిల్స్ ఉన్న వ్యక్తులకు, నిపుణులకు జాబ్ మార్కెట్లో మంచి శాలరీ ఆఫర్లను కంపెనీలు అందిస్తున్నాయి. యావరేజ్ గా ఈ ఉద్యోగులకు కంపెనీలు ఏకంగా రూ.70 లక్షల వరుకు వార్షిక వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి.

ఫుల్‌స్టాక్ డెవ‌ల‌ప‌ర్ :

ఫుల్‌స్టాక్ డెవ‌ల‌ప‌ర్ :

ఫుల్‌స్టాక్ డెవ‌ల‌ప‌ర్ల‌కు ఉద్యోగ అవ‌కాశాలు మార్కెట్లో భారీగానే ఉన్నాయి. ప్రోగ్రామింగ్‌లో ప‌ట్టుతో పాటు కాన్సెప్ట్ నుంచి ఫినిష్డ్ ప్రోడ‌క్ట్ వ‌ర‌కూ అవగాహన తప్పనిసరి. ఈ సాంకేతిక స్కిల్స్ ఉన్న వ్యక్తులకు, నిపుణులకు జాబ్ మార్కెట్లో మంచి శాలరీ ఆఫర్లను కంపెనీలు అందిస్తున్నాయి. యావరేజ్ గా ఈ ఉద్యోగులకు కంపెనీలు ఏకంగా రూ.70 లక్షల వరుకు వార్షిక వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి.

డెవాప్స్ ఇంజనీర్ :

డెవాప్స్ ఇంజనీర్ :

కోడింగ్ నైపుణ్యాలు ఉన్న నవ ఇంజనీర్లకు డెవాప్స్ మంచి ఉపాధి అవ‌కాశాలను అందిస్తోంది. నెట్‌వ‌ర్క్ ఆప‌రేష‌న్స్‌ను అర్థం చేసుకుంటూ.. డెవాప్స్ టూల్స్‌ను అభివృద్ధి చేసే టెక్కీలకు మంచి గ్రోత్ అవకాశాలను ఐటీ రంగం అందిస్తోంది. డెవాప్స్ ఇంజ‌నీర్ల‌కు ఉన్న అధిక డిమాండ్ కారణంగా కంపెనీలు రూ.80 లక్షల వరకు వార్షిక వేతనాన్ని అందించేందుకు ముందుకొస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ :

సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ :

చివరిగా చాలా మంది పూర్తి చేస్తున్న కంప్యూట‌ర్ సైన్స్‌, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం డిజైన్ వంటి స్కిల్స్ ఉన్న వారికి కూడా కంపెనీలు అంత భారీగా కాకపోయినా మంచి ప్యాకేజీలనే అందిస్తున్నాయి. పైగా ప్రస్తుతం మెటావెర్స్, బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీల వంటి వాటిలో విరివిగా వినియోగిస్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ స్కిల్స్ ఉన్న నిపుణులకు కంపెనీలు యావరేజ్ గా రూ.6 లక్షల వరకు వార్షిక వేతనాన్ని అందిస్తున్నాయి. పైగా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ భవిష్యత్తులో మరింత పాపులర్ టూల్ గా మారే అవకాశం ఉంది.

English summary

High Paid IT Jobs: 2022లో అధిక జీతాలు ఈ స్కిల్స్ ఉన్న టెక్కీలకే.. మీకూ ఈ నైపుణ్యాలు ఉన్నాయేమో తెలుసుకోండి.. | know about these high paying tech skills that it industry recruiting from artificial inteligence to block chain technology

know about these high paying tech skills that it industry recruiting
Story first published: Wednesday, July 13, 2022, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X