For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rakesh Jhunjhunwala: బిగ్ బుల్‌కు అదృష్టాన్ని తెచ్చిన స్టాక్స్.. అందుకే టాటాలంటే అభిమానం..

|

Rakesh Jhunjhunwala: భారత స్టాక్ మార్కెట్‌లో రాకేష్ జున్‌జున్‌వాలా చాలా మందికి దిక్సూచి లాంటి వారు. అందుకే ఆయనను 'బిగ్ బుల్' అని కూడా పిలుస్తారు. అయితే అతనికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి జున్‌జున్‌వాలాను దలాల్ స్ట్రీట్‌లోని బిగ్ బుల్‌గా మార్చడంలో టాటా గ్రూప్ అత్యంత ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది. వీటిలో మొదటిది టాటా టీ కాగా రెండవది టైటాన్ స్టాక్ అని చెప్పుకోవాలి.

టాటా-టీ మొదటి లాభం..

టాటా-టీ మొదటి లాభం..

1985లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన రాకేష్ జున్‌జున్‌వాలాకు టాటా గ్రూప్ కంపెనీ షేర్లు లాభాల ఆర్జనలో దోహదపడ్డాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించిన తొలినాళ్లలో మొదట టాటా టీకి చెందిన 5000 షేర్లను ఒక్కో షేరుకు రూ.43 చొప్పున కొనుగోలు చేశారు. అప్పట్లో కేవలం మూడు నెలల్లోనే షేరు ధర రూ.43 నుంచి రూ.143కి చేరింది. అయినా ఆ షేర్లను మూడేళ్ల పాటు హోల్డ్ ఎక్కించటంతో దాదాపు రూ.25 లక్షలు సంపాదించాడు. అదే ఆయన పొందిన అతిపెద్ద లాభం అని చెప్పుకోవాలి. అలా మెుదలైన స్టాక్ మార్కెట్ ప్రయాణం మరణం వరకు సాగింది.

టాటా-టీ మొదటి లాభం..

టాటా-టీ మొదటి లాభం..

1985లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన రాకేష్ జున్‌జున్‌వాలాకు టాటా గ్రూప్ కంపెనీ షేర్లు లాభాల ఆర్జనలో దోహదపడ్డాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించిన తొలినాళ్లలో మొదట టాటా టీకి చెందిన 5000 షేర్లను ఒక్కో షేరుకు రూ.43 చొప్పున కొనుగోలు చేశారు. అప్పట్లో కేవలం మూడు నెలల్లోనే షేరు ధర రూ.43 నుంచి రూ.143కి చేరింది. అయినా ఆ షేర్లను మూడేళ్ల పాటు హోల్డ్ ఎక్కించటంతో దాదాపు రూ.25 లక్షలు సంపాదించాడు. అదే ఆయన పొందిన అతిపెద్ద లాభం అని చెప్పుకోవాలి. అలా మెుదలైన స్టాక్ మార్కెట్ ప్రయాణం మరణం వరకు సాగింది.

టైటాన్ షేర్..

టైటాన్ షేర్..

టాటా-టీ తర్వాత రాకేష్ జున్‌జున్‌వాలా టాటా గ్రూప్ కంపెనీ టైటాన్‌లో ధర చాలా తక్కువగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టారు. 2002-03లో ఆయన టైటాన్ షేర్ల సగటు ధర రూ.3 ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. అయితే.. ప్రస్తుతం టైటాన్ స్టాక్స్ ధర రూ.2,472 కంటే ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ షేర్ల నుంచి భారీగా లాభాలు రావడంతో జున్‌జున్‌వాలా పేరు స్టాక్‌ మార్కెట్‌లో బిగ్‌ బుల్‌గా మారుమోగింది. జూన్ 2022 నాటికి టైటాన్ కంపెనీలో ఆయనకు, భార్య రేఖకు 5.1 శాతం వాటా ఉంది. వారి హోల్డింగ్ విలువ మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ. 11,000 కోట్లుగా ఉంది.

రియల్ ఎస్టేట్ నుంచి బ్యాంకింగ్ వరకు..

టైటాన్‌తో పాటు జున్‌జున్‌వాలా తన కలలకు రెక్కలిచ్చి పెట్టుబడుల పరిధిని విస్తరించారు. ఆ తరువాత బిగ్ బుల్ ప్రతి రంగంలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలను ఆర్జించాడు. ఆయన పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను గమనించినట్లయితే.. 13 శాతం రియల్ ఎస్టేట్ అండ్ నిర్మాణ రంగంలో, 6 శాతం ఫైనాన్స్ రంగంలో, 6 శాతం ఫార్మాస్యూటికల్స్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో 6 శాతం, కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, మౌలిక సదుపాయాలు, పాదరక్షలు, ఆటో, ప్యాకేజింగ్‌కు సంబంధించిన కంపెనీల్లో 3 శాతం పెట్టుబడులను కలిగి ఉన్నారు.

గౌతం అదానీ సంతాపం..

గౌతం అదానీ సంతాపం..

స్టాక్ మార్కెట్ వెటరన్ రాకేష్ జున్‌జున్‌వాలా మృతి పట్ల దేశంలోని అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ సంతాపం తెలిపారు. అదానీ ట్వీట్ లో.. భారతదేశపు గొప్ప పెట్టుబడిదారుడి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జున్‌జున్‌వాలా తన అద్భుతమైన ఆలోచనలతో ఈక్విటీ మార్కెట్‌లపై నమ్మకం ఉంచేలా మొత్తం తరాన్ని ప్రేరేపించారు. తాను, దేశం ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అని రాశారు. ఇదే సమయంలో మరో పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ సైతం తన నివాళులర్పించారు. నా స్నేహితుడు, స్టాక్ మార్కెట్ లెజెండ్ ఇక లేరంటూ ట్వీట్ చేశారు.

English summary

Rakesh Jhunjhunwala: బిగ్ బుల్‌కు అదృష్టాన్ని తెచ్చిన స్టాక్స్.. అందుకే టాటాలంటే అభిమానం.. | know about tata stocks that turned Rakesh Jhunjhunwala as bigbull of indian stock markets

know about stocks that changed fate of ace investor Rakesh Jhunjhunwala
Story first published: Monday, August 15, 2022, 12:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X