For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Repo Rate Hike: రేపే వడ్డీ రేట్ల ప్రకటన.. రేటు ఎంత పెరగవచ్చంటే..? మీపై ప్రభావం ఇదే..

|

Repo Rate Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం గవర్నర్ ప్రకటించనున్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సెంట్రల్ బ్యాంక్ మరోసారి రెపో రేటును పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సెంట్రల్ బ్యాంకులు సైతం ఇదే పద్ధతిని అవలంభిస్తున్నాయి. మే నెల నుంచి ఇప్పటి వరకు రిజర్వు బ్యాంక్ ఏకంగా 140 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతానికి చేరుకుంది. ఈ సారి ఆర్‌బీఐ మరో 50 పాయింట్లు రేటు పెంపును ప్రకటిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో మీ జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది.

ఫెడ్ వడ్డన తర్వాత..

ఫెడ్ వడ్డన తర్వాత..

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. అలాగే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మళ్లీ పెరగటం ఆర్థిక మాంద్యం తప్పదా అనే ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ శుక్రవారం రెపో రేటును పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే దేశంలోని బ్యాంకులు సైతం తమ వడ్డీ రేట్లను సవరిస్తాయి. దీని వల్ల చెల్లించాల్సిన వాయిదాలు సైతం పెరుగుతాయి.

 ఖరీదుగా మారనున్న లోన్స్..

ఖరీదుగా మారనున్న లోన్స్..

రెపో రేట్ల పెంపుతో ఆ భారాన్ని బ్యాంకులు ఏకంగా తమ కస్టమర్లకు బదిలీ చేస్తాయి. దీనివల్ల ప్రస్తుతం తీసుకున్న కొన్ని రకాల రుణాల కస్టమర్లకు భారం పెరగటం మాత్రమే కాక, కొత్తగా లోన్స్ తీసుకోవాలనుకునేవారికి లోన్స్ ఖరీదుగా మారతాయి. ఇలాంటి సమయంలో కంపెనీలు సైతం రుణం తీసుకుని వ్యాపారాలను విస్తరించేందుకు విముకత చూపుతాయి. ఇది ఇళ్ల విక్రయాలపై కూడా ప్రభావం చూపుతుంది. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో బిల్డర్లు ఇప్పటికే స్థిరాస్తి ధరలను పెంచారు. ఇది రికవరీని నెగటివ్ గా ప్రభావితం చేస్తుంది.

 పెరుగుదల ప్రభావం ఇలా..

పెరుగుదల ప్రభావం ఇలా..

ఎవరైనా వ్యక్తి ఏప్రిల్ 2022లో 6.9 శాతం వడ్డీ రేటుకు 20 ఏళ్లకు కోటి రూపాయల హోమ్ లోన్ తీసుకున్నట్లయితే అతడిని రేట్ల పెంపు ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రేటు ప్రకారం అతడు చెల్లించాల్సిన వాయిదా రూ.76,931 అవుతుంది. అయితే వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగినట్లయితే అతను చెల్లించాల్సిన వాయిదా మెుత్తం రూ.87,734కి చేరుతుంది. అంటే దాదాపు రూ.11 వేల వరకు భారం పెరుగుతుంది.

ఏఏ రుణాల రేట్లు పెరుగుతాయి..

ఏఏ రుణాల రేట్లు పెరుగుతాయి..

హౌసింగ్ లోన్స్ తో పాటు.. వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ కూడా ఖరీదైనవిగా మారతాయి. ఇలా వడ్డీ రేట్లు పెరగటం వల్ల సామాన్య ప్రజలు తమ అవసరాలను వాయిదా వేసుకుంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గటానికి కారణంగా మారుతుంది. అలా దేశ వృద్ధి రేటు సైతం రెపో రేటు పెంపు కారణంగా ప్రభావితం అవుతుంది. కానీ మరో పక్క రెపో రేటు పెంపు అనేది FD పెట్టుబడిదారులకు ప్రయోజనకరం చేకూరుస్తుంది. ఎందుకంటే డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లు పెరుగుతాయి కాబట్టి.

English summary

Repo Rate Hike: రేపే వడ్డీ రేట్ల ప్రకటన.. రేటు ఎంత పెరగవచ్చంటే..? మీపై ప్రభావం ఇదే.. | know about impact of repo rate by rbi tomorrow amid high inflation who are impacted with this

know about impact of repo rate by rbi tomorrow amid high inflation who are impacted with this
Story first published: Thursday, September 29, 2022, 18:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X