For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto Crash 2022: క్రిప్టో ఇన్వెస్టర్లకు రానున్నది గడ్డుకాలమేనా..! ఇప్పుడు బిట్ కాయిన్ కొనొచ్చా.. నిపుణులు..

|

వివిధ క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో క్యాస్కేడింగ్ రెడ్ గ్రాఫ్‌ల శ్రేణి పెట్టుబడిదారులను భయాల్లోకి నెట్టేసింది. క్రిప్టో డిజిటల్ కరెన్సీల నుంచి త్వరగా డబ్బు సంపాదించాలని చూస్తున్న చాలా మంది పెట్టుబడిదారులకు ప్రస్తుతం కుప్పకూలుతున్న కరెన్సీ రేట్లు చెక్ పెడుతున్నాయి. క్రిప్టో కరెన్సీలను నమ్మి చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం మోసపోయారు. క్రిప్టో వాల్యుయేషన్ పరంగా చెత్త నెలల్లో కొన్నింటిని చూడడమే కాకుండా.. ఈ కరెన్సీలు ఎకనమిక్ స్టెబిలిటీని అందిస్తాయని భావించిన వారిని సైతం మోసం చేశాయి.

 క్రిప్టోల భవిష్యత్తు ఏమిటి?

క్రిప్టోల భవిష్యత్తు ఏమిటి?

అయితే ఇది ఎలా జరిగింది? డిజిటల్ కరెన్సీల్లో బిట్‌కాయిన్ తరువాతి పెద్ద కరెన్సీగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది భావించారు. ఒకానొక సమయంలో దీనిపై పెద్ద ప్రచారం, చర్చ కూడా జరిగింది. కానీ.. దానిపై అలుముకున్న అనిశ్చితి కారణంగా బిట్ కాయిల్ భవిష్యత్తు ఉరితాడుకు వేలాడుతోంది. ఇకపై భారత్ తో పాటు, ఇతర దేశాల్లో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇకపై వాటిని ప్రజలు నమ్ముతారా, వాటిలో పెట్టుబడులను కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది.

అయితే అనేక దేశాల్లో ప్రభుత్వాలు మాత్రం ప్రజలను ఇలాంటి పెట్టుబడులకు దూరం చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. క్రిప్టో లాభాలపై అధిక టాక్సులు, టీడీఎస్, ఇతర పన్నులను విధిస్తున్నాయి. ఈ డిజిటల్ ఆస్తుల్లో ఇన్వెస్టర్లను నిరుత్సాహ పరిచేసేందుకు ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నిస్తున్నాయి.

బిట్‌కాయిన్ దారెటు..?

బిట్‌కాయిన్ దారెటు..?

ఈ క్రిప్టో గందరగోళం వెనుక ఉన్న కొన్ని కారణాలను, పెట్టుబడిదారులు, ఎక్స్ఛేంజీలను ఒకేలా డీల్ చేసిన నష్టం, రాబోయే రోజుల్లో గమనించవలసిన కొన్ని అంశాలను పరిశీలిద్దాం.. క్రిప్టో పెట్టుబడిదారులకు 2021 సంవత్సరం ఉత్తమ సమయాల్లో ఒకటి. నవంబర్ 2021లో బిట్‌కాయిన్ ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి 69,000 డాలర్లను(రూ. 54.5 లక్షలు) తాకగా, మొత్తం బిట్‌కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

విశ్లేషకులతో పాటు బిట్ కాయిన్ ప్రమోట్ చేసేవారు.. ఏడాది చివరినాటికి బిట్ కాయిన్ విలువ ఒక్కొక్కటి లక్ష డాలర్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. కానీ.. ప్రస్తుతం బిటి కాయిన్ ధర కనిష్ఠాలైన 19,165 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తుంటే.. రానున్న కాలంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయని వారికి తెలియదనిపిస్తోంది.

రానున్న రోజులు గడ్డుకాలమే

రానున్న రోజులు గడ్డుకాలమే

మొత్తంమీద ఇది నవంబర్‌లో దాని రికార్డు ఆల్-టైమ్ గరిష్ఠస్థాయి నుంచి బిట్‌కాయిన్ సుమారుగా 70 శాతం క్షీణించింది. అయితే.. Dogecoin, Avalanche, Solana వంటి ఇతర టోకెన్‌లు 90 శాతం వరకు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీల మొత్తం మార్కెట్ క్యాప్ 860 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే అనేక సంవత్సరాలుగా క్రిప్టో కరెన్సీలను గమనిస్తూ వాటిపై కథనాలు రాసినవారు గ్లోబల్ ద్రవ్యోల్బణమే క్రిప్టోల వినాశనానికి కారణమని అంటున్నారు.

మరో పక్క అమెరికా సైతం మాంద్యం ముంగిట పోరాడుతుండటంతో క్రిప్టోల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని తగ్గించటానికి, మార్కెట్లలో లిక్విడిటీని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్రిప్టో మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక టోకెన్లు తిరిగి పంజుకుంటాయని వారు అంటున్నారు.

నిపుణుల మాటేంటి..

నిపుణుల మాటేంటి..

క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌ల విపరీతమైన ఓవర్ వాల్యుయేషన్, రష్యా-ఉక్రెయిన్ వార్, కరోనా లాక్ డౌన్, ప్రభుత్వాల కఠిన ఆంక్షలు పతననానికి కారణాలని హైబ్రిడ్ ఫైనాన్స్ బ్లాక్‌చెయిన్ (HYFI) చీఫ్ బ్లాక్‌చెయిన్ ఆర్కిటెక్ట్ అయిన రోహాస్ నాగ్‌పాల్ అంటున్నారు. క్రిప్టో లావాదేవీల హిస్టరీని ట్రాక్ చేయలేక పోవటం, వాటిలో చట్టబద్ధత లేకపోవటం, ప్రమాదకరమైన ప్రవర్తనల వల్ల ప్రభుత్వాలు వాటిపై నిషేధం విదిస్తున్నాయి.

మన దేశంలో పరిస్థితులు..

భారత ప్రభుత్వం గత బడ్జెట్ సెషన్‌లో NFTలతో సహా డిజిటల్ ఆస్తుల బదిలీపై ఫ్లాట్ 30 శాతం పన్నును ప్రకటించింది. అలాగే.. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) క్రిప్టో వాలెట్‌ల కోసం UPI బదిలీ ఫీచర్‌ను నిలిపివేసింది. దీని వల్ల ప్రజలు తమ బ్యాంక్ ఖాతాల నుంచి వారి క్రిప్టో వాలెట్‌లకు డబ్బును బదిలీ చేయడం మరింత కష్టతరం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇటీవల చేసిన ప్రకటన అన్ని క్రిప్టో లావాదేవీలపై మూలం వద్ద 1 శాతం పన్ను మినహాయింపు(TDS) విధించడం క్రిప్టో కమ్యూనిటీకి నచ్చలేదు.

English summary

Crypto Crash 2022: క్రిప్టో ఇన్వెస్టర్లకు రానున్నది గడ్డుకాలమేనా..! ఇప్పుడు బిట్ కాయిన్ కొనొచ్చా.. నిపుణులు.. | know about great crypto crash which lead investors heavy lose in 2022 and know about its future too

know all about crypto crash 2022 and its future for investors
Story first published: Saturday, July 2, 2022, 11:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X