For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?

|

Holidays in February: భారతదేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సంబంధించిన శెలవుల జాబితాను రిజర్వు బ్యాంక్ ప్రకటిస్తుంటుంది. ఇవి దేశంలోని వివిధ రాష్ట్రాలకు అక్కడి పండుగల ఆధారంగా మారిపోతుంటాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 2023 సంవత్సరంలో బ్యాంకులు ఏకంగా 10 రోజుల పాటు మూతపడనున్నాయి.

సెలవుల నిర్ణయం..

సెలవుల నిర్ణయం..

దేశంలోని బ్యాంకులకు RBI మెుత్తం మూడు కేటగిరీల కింద సెలవులను ప్రకటిస్తుంటుంది. అందువల్ల ముఖ్యమైన బ్యాంక్ పనులను సకాలంలో పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించటం చాలా ముఖ్యం. బ్యాంకులు మూసివేసి ఉన్నప్పటికీ డబ్బు పంపటం, పొందటం లాంటి వాటని నెట్ బ్యాంకింగ్, డిజిటల్ రూపంలో పూర్తి చేయవచ్చు. అయితే నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనుల విషయంలో సెలవు దినాల గురించి తెలుసుకోవటం చాలా కీలకం.

ఒక్క శనివారం..

ఒక్క శనివారం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల లిస్ట్ ప్రకారం బ్యాంకులు ఫిబ్రవరిలో 10 రోజులు సెలవులో ఉంటాయి. దీనిలో రెండవ, నాల్గవ శనివారాలు కూడా సెలవు ఉంటుంది. ఇక ఆదివారం సాధారణంగానే సెలవు. బ్యాంకులు వచ్చే నెలలో వరుసగా మూడు శనివారాలు అంటే ఫిబ్రవరి 11, 18, 25న మూసివేసి ఉంటాయి. అంటే కేవలం ఒక్క శనివారం మాత్రమే బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయని గమనించాలి.

ఫిబ్రవరి 2023లో బ్యాంకు సెలవులు..

ఫిబ్రవరి 2023లో బ్యాంకు సెలవులు..

ఫిబ్రవరి 5 (ఆదివారం)- భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 11 (రెండవ శనివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 12 (ఆదివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 15 (బుధవారం) - Lui-Ngai-Ni సందర్భంగా ఇంఫాల్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 18 (3వ శనివారం) - మహాశివరాత్రి సందర్భంగా, త్రిపుర, మిజోరం, చండీగఢ్ మినహా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 19 (ఆదివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 20 (సోమవారం) - లుయి-నగై-ని సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 21 (మంగళవారం) - లోసార్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 25 (నాల్గవ శనివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.

ఫిబ్రవరి 26 (ఆదివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.

English summary

Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..? | Know About Bank Holidays In February 2023 across various states in India

Know About Bank Holidays In February 2023 across various states in India..
Story first published: Sunday, January 29, 2023, 10:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X