For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kia: ఆ రెండు అప్‌గ్రేడ్ మోడల్స్‌లో అద్దిరిపోయే ఫీచర్లు ఇవే

|

ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా.. అత్యధికంగా అమ్ముడుపోతున్న రెండు మోడళ్లను మరింత అప్‌గ్రేడ్ చేసింది. కియా సెల్టోస్, కియా సోనెట్‌ మోడళ్లను విడుదల చేసింది. కొత్త మోడల్ సోనెట్ ప్రారంభ ధర 7.15 లక్షల రూపాయలు సెల్టోస్ ప్రారంభ ధర 10.19 లక్షల రూపాయలుగా నిర్ధారించింది. అప్‌గ్రేడ్ చేసిన వర్షన్ ప్రకారం చూసుకుంటే- ఇదివరకు హైఎండ్ వేరియంట్లలో మాత్రమే లభించే ఫీచర్లు ఇప్పుడు బేస్ వేరియంట్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి.

భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ రెండు కార్లల్లో సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అమర్చింది. దీనితో ఈ రెండింట్లో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వినియోగంలోకి వచ్చాయి. కొత్తగా కలర్ ఆప్షన్‌లను తెచ్చింది. ఇంపీరియల్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని కొత్త 2022 మోడళ్లపై రీడిజైన్ చేసిన బ్రాండ్ బ్యాడ్జ్‌ ఉంటుంది. కియా సెల్టోస్ 13 కొత్త అప్‌డేట్ లను కలిగి ఉంటుంది. సెల్టోస్ హెచ్‌టీకే ప్లస్ వేరియంట్‌ 1.5 డీజిల్ ఇంజన్‌.. అప్‌గ్రేడ్ వర్షన్‌లో ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

Kia India launched new versions of its two popular products, Seltos and Sonet

డీజిల్ మోడల్ కారులో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి ఐఎంటీ కారు ఇది. సోనెట్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, హై లైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. సెల్టోస్‌లో డీ-కట్ స్టీరింగ్ వీల్, ఎస్‌యూఎస్ స్కఫ్ ప్లేట్, టెయిల్‌గేట్‌పై కొత్త సెల్టోస్ లోగో డిజైన్ వంటి మార్పులు చేసింది కంపెనీ. సెల్టోస్ ఎక్స్ లైన్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు ఇండిగో పారా సీట్లపై ఎక్స్ లైన్ లోగోను కూడా కలిగి ఉంటుంది.

కియా సోనెట్ హెచ్‌టీఎక్స్ ప్లస్ వేరియంట్‌లో కూడా ఇప్పుడు సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌ల సంఖ్య పెరిగింది. నాలుగు ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. అధునాతన 10.67 సెంటీమీటర్ల కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ అందుబాటులో ఉందీ మోడల్‌లో. కారుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో సెమీ లెథెరెట్ సీట్లను ఇప్పుడు హెచ్‌టీఈ వేరియంట్ నుంచే అందుతోంది. సెల్టోస్ తరహాలోనే సొనెట్ ‌లోనూ డీ-కట్ స్టీరింగ్ వీల్, టెయిల్‌గేట్‌పై అప్‌డేటెడ్ వర్షన్ లోగోను ముద్రించింది కంపెనీ.

English summary

Kia: ఆ రెండు అప్‌గ్రేడ్ మోడల్స్‌లో అద్దిరిపోయే ఫీచర్లు ఇవే | Kia India launched new versions of its two popular products, Seltos and Sonet

Automaker Kia India on Friday launched the refreshed versions of its two popular products, Seltos and Sonet, with prices starting at Rs 10.19 lakh and Rs 7.15 lakh, respectively.
Story first published: Saturday, April 9, 2022, 18:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X