For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Free Shares: ఒక షేర్ ఉంటే 2 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.6 కోట్లుగా మార్చిన స్టాక్.. ఆఖరి ఛాన్స్..

|

Bonus Shares: మార్కెట్లో లిస్ట్ అయిన స్టాక్స్ వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే క్యాపిటల్ అప్రీసియేషన్ తో పాటు బోనస్ షేర్లను అందించే కంపెనీ చాలా అరుదుగా ఉంటాయి. అలా ఈ మల్టీబ్యాగర్ తన ఇన్వెస్టర్లకు కోట్ల ఆదాయంతో పాటు ఇప్పుడు ఉచితంగా షేర్లను కూడా అందిస్తోంది.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది జ్యోతి రెసిన్లు అండ్ అడ్హెసివ్స్ స్టాక్ గురించే. ఇది ప్రస్తుతం తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందిస్తున్నట్లు ప్రకటించటంతో వార్తల్లో నిలిచింది. తన పెట్టుబడిదారులకు కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను బహుమతిగా అందిస్తోంది. అంటే కంపెనీలో ఒక్క షేర్ ఉంటే వారికి ఉచితంగా రెండు షేర్లను కంపెనీ అందిస్తుందని అర్థం.

బోనస్ షేర్లు ఎలా పొందాలి..

బోనస్ షేర్లు ఎలా పొందాలి..

జ్యోతి రెసిన్‌ల షేర్లు సెప్టెంబర్ 08, 2022 గురువారం ఎక్స్-బోనస్ తేదీతో ట్రేడింగ్ అవుతున్నాయి. బోనస్ షేర్ రికార్డ్ తేదీ సెప్టెంబర్ 09, 2022. అంటే రికార్డ్ తారీఖున కంపెనీలో షేర్లను కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే కంపెనీ బోనస్ షేర్లను అందిస్తుంది. గురువారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్లు 5% అప్పర్ సర్క్యూట్‌లో ట్రేడవుతున్నాయి.

కోట్లు కురిపించిన కెమికల్ స్టాక్..

కోట్లు కురిపించిన కెమికల్ స్టాక్..

10 ఏళ్ల కాలంలో మల్టీబ్యాగర్ కెమికల్ కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందించింది. దీని ప్రకారం డిసెంబర్ 11, 2013న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో షేరు ధర రూ.6.38 స్థాయిలో ఉంది. సెప్టెంబర్ 06, 2022న BSEలో జ్యోతి రెసిన్ షేర్లు రూ.4,383కి చేరుకున్నాయి. ఒక వ్యక్తి 2013లో కంపెనీ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే.. మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుతం అతను మొత్తం రూ.6.89 కోట్లను పొందేవాడు. పైగా దీనికి తోడు ప్రస్తుతం కంపెనీ బోనస్ షేర్లను కూడా అందిస్తోంది.

5 ఏళ్లలో రాబడి ఇలా..

5 ఏళ్లలో రాబడి ఇలా..

గత 5 సంవత్సరాల్లో కూడా కంపెనీ షేర్లు అద్భుతమైన రాబడిని అందించాయి. సెప్టెంబర్ 11, 2017న BSEలో కంపెనీ షేర్లు రూ.82.35 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 06, 2022న BSEలో రూ.4,383కి చేరుకున్నాయి. అంటే ఈ సమయంలో లక్ష పెట్టుబడిని ఏకంగా రూ.53.22 లక్షలుగా మార్చేసింది. కంపెనీ షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.4,400 ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.750.05గా ఉంది.

English summary

Free Shares: ఒక షేర్ ఉంటే 2 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.6 కోట్లుగా మార్చిన స్టాక్.. ఆఖరి ఛాన్స్.. | jyoti resins and adhesives multibagger stock giving bonus shares for free know details

jyoti resins and adhesives multibagger stock giving bonus shares for free know details
Story first published: Thursday, September 8, 2022, 18:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X