For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా భయాలు: 'ఫ్యామిలీతో న్యూఇయర్ బ్రేక్ కావాలి, రూ.1 లక్ష వెచ్చిస్తాం'

|

కరోనా మహమ్మారి పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ వైరస్ దెబ్బతో చాలామంది ఎన్నో జాగ్రత్తల్లో భాగంగా బయటకు వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేది లేదని 43 శాతం మంది ఓ సర్వేలో చెప్పారు. 36 శాతం మంది మాత్రమే బయటకు వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు బాట్ ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ నివేదికలో పలు విషయాలు వెల్లడయ్యాయి.

రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్‌ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్!రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్‌ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్!

ప్రయాణ పల్స్‌ను అంచనా వేయడానికి

ప్రయాణ పల్స్‌ను అంచనా వేయడానికి

'ఈ సంవత్సరం కేవలం 36 శాతం మంది మాత్రమే ఫ్యామిలీతో హాలీడేకు వెళ్లాలని కోరుకుంటున్నారు. 43 శాతం మంది కరోనా భయాలతో ఆసక్తి చూపించడం లేదు' బాట్ ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ (BOTT Travel Sentiment Tracker) సర్వే పేర్కొంది. BOTT-బిజినెస్ ఆప్ ట్రావెల్ ట్రేడ్ ఇటీవల దేశంలోని ప్రయాణ పల్స్‌ను అంచనా వేయడం కోసం బాట్ ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ ప్రారంభించింది. జూలై 1వ తేదీ నుండి జూలై 28వ తేదీ మధ్య 21 ఏళ్ల వయస్సు నిండిన 5,000 మంది ట్రావెలర్స్ అభిప్రాయాలను ఆన్ లైన్ ద్వారా సేకరించింది.

న్యూఇయర్ బ్రేక్

న్యూఇయర్ బ్రేక్

న్యూఇయర్ బ్రేక్ కావాలని 44 శాతం మంది కోరుకున్నారు.

33శాతం మంది నవంబర్-డిసెంబర్ మధ్య ఫ్యామిలీ హాలీడే కావాలని తెలిపారు.

అందర్నీ కలిసేందుకు 39 శాతం మంది వీకెండ్ సెలవు రోజులు కోరుకున్నారు.

35 శాతం మంది 3 నుండి 5 రోజుల హాలీడే ఇష్టపడ్డారు.

18 శాతం మంది డే ట్రిప్‌పై మక్కువ చూపించారు.

సర్వేలో పాల్గొన్నవారిలో 32 శాతం మంది ప్రయివేటు లేదా సొంత రవాణాతోనే హాలీడే కోరుకున్నారు.

28 శాతం మంది ట్యాక్సీలు, 25 శాతం మంది విమానయానం కోరుకున్నారు.

ఖర్చు ఇంతే చేస్తాం...

ఖర్చు ఇంతే చేస్తాం...

రూ.50,000 నుండి రూ.1,00,000 ఖర్చు చేస్తామని 41 శాతం మంది చెప్పగా, 30 శాతం మంది రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలు ఖర్చు చేస్తామన్నారు.

24 శాతం మంది ట్రావెలర్స్ ఖరీదైన హోటల్స్, రిసార్టులను ప్రిఫర్ చేశారు. 19 శాతం మంది మతపరమైన గమ్యస్థానాలు, కొండలు, అడ్వెంచర్ గమ్యస్థానాలు కోరుకున్నారు.

18 శాతం మంది బీచ్ పట్ల ఆసక్తి కనబరిచారు.

కరోనా నేపథ్యంలో సురక్షిత హోటల్స్, రిసార్టులను ప్రత్యేకంగా ఎంచుకుంటామని తెలిపారు.

15 శాతం మంది మాత్రం మంచి ఆఫర్స్ ఉన్న హోటల్స్, రిసార్టులకు వెళ్తామని తెలిపారు.

కోవిడ్ సేఫ్ ఎయిర్‌లైన్స్‌ను ప్రిఫర్ చేస్తామని 62 శాతం మంది చెప్పగా, మంచి ఆఫర్లు చూస్తామని 32 శాతం మంది తెలిపారు.

అతిపెద్ద ఉద్యోగల సృష్టించే రంగంగా..

అతిపెద్ద ఉద్యోగల సృష్టించే రంగంగా..

ప్రస్తుతపరిస్థితుల్లో ఆతిథ్యరంగం పుంజుకోవడానికి ఆయా రాష్ట్రాలు టూరిజంలో కరోనా రక్షణ చర్యలను అందరి దృష్టికి తీసుకు వెళ్లాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) ప్రెసిడెంట్ పీపీ ఖన్నా తెలిపారు. కరోనా మహమ్మారి పర్యాటక రంగ పురోగతిని మార్చివేసిందని, నిర్వీర్యం చేయలేదని చెప్పారు. భారతదేశానికి ఇది అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తగా మారే రంగం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary

కరోనా భయాలు: 'ఫ్యామిలీతో న్యూఇయర్ బ్రేక్ కావాలి, రూ.1 లక్ష వెచ్చిస్తాం' | Just 36 percent travellers willing to go on family holiday this year

As the COVID-19 pandemic continues to severely impact the travel and tourism sector, a survey has showed that just 36 per cent respondents are willing to go on a family holiday while about 43 per cent have decided to skip holidaying this year.
Story first published: Wednesday, August 5, 2020, 16:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X