For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jobless rate: నాలుగు నెలల కనిష్టానికి భారత నిరుద్యోగిత రేటు

|

భారత్‌లో జాబ్‌లెస్ రేట్ జూలై నెలలో నాలుగు నెలల కనిష్టానికి చేరింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం అమ్మకపు పన్ను వసూళ్లు, కొన్ని వస్తువుల డిమాండ్ భారీగా పుంజుకుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న సంకేతాలు కనిపించిన నేపథ్యంలో నిరుద్యోగిత రేటు కూడా నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం అంతకుముందు నెలలో నిరుద్యోగిత రేటు 9.17 శాతంగా ఉండగా, జూలై నెలలో ఇది 6.95 శాతానికి క్షీణించింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు 6.3 శాతానికి, పట్టణ నిరుద్యోగిత రేటు 8 శాతానికి క్షీణించింది.

కరోనా సెకండ్ వేవ్ తగ్గిన నేపథ్యంలో జాబ్ మార్కెట్ తిరిగి పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశం. ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభమైన FY22లో భారత జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండవచ్చునని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేస్తోంది. జూన్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్షకోట్ల దిగువకు పడిపోగా, జూలై నెలలో తిరిగి పుంజుకున్నాయి. ఇది కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెప్పడానికి నిదర్శనం.

Jobless rate drops to four months low in July in India

నిరుద్యోగిత రేటు 2021 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆరు శాతం నుండి ఏనిమిది శాతం మధ్య ఉండగా, మే నెలలో ఏకంగా 12 శాతం దగ్గరకు చేరుకుంది. జూన్ నెలలో 11 శాతం దాటింది. ఇప్పుడు జూలైలో తిరిగి నాలుగు నెలల కనిష్టానికి చేరుకుంది.

English summary

Jobless rate: నాలుగు నెలల కనిష్టానికి భారత నిరుద్యోగిత రేటు | Jobless rate drops to four months low in July in India

India's jobless rate fell to the lowest level in 4 months in July, adding to signs of a nascent recovery in the economy where sales tax collections and demand for some commodities have signaled a rebound.
Story first published: Monday, August 2, 2021, 22:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X