For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Recession: మంచి కాలం మించిపోయింది..? జాబ్ క్రియేషన్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే..?

|

Recession: ఆర్థిక మాంద్యం వస్తుందా..? వస్తే తీవ్రత ఎలా ఉంటుంది..? అనే అంచనాలు వేసేందుకు ఆర్థిక నిపుణులు అనేక ప్యారామీటర్లను పరిగణలోకి తీసుకుంటారు. వాటిలో చాలా ముఖ్యమైన అంశాలు నిరుద్యోగిత, కొత్త ఉద్యోగాల కల్పన.

ఈపీఎఫ్ఓ నివేదిక..

ఈపీఎఫ్ఓ నివేదిక..

EPFO, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ పెన్షన్ స్కీమ్‌ వివరాల ప్రకారం భారతదేశంలో అధికారిక ఉద్యోగ కల్పన ఆగస్ట్‌లో మందగించింది. నాలుగు నెలల తర్వాత ఉద్యోగాల కల్పనలో మందగమనం చోటుచేసుకుంది. పేరోల్ డేటా ప్రకారం ఆగస్టులో ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్ల సంఖ్య జూలై కంటే 7.1% తగ్గి 1.69 మిలియన్లకు పడిపోయింది.

 జేపీ మోర్గన్ ప్రకారం..

జేపీ మోర్గన్ ప్రకారం..

అంతర్జాతీయ రేటింగ్ సంస్థ జేపీ మోర్గన్ అంచనాల ప్రకారం ప్రస్తుతం అమెరికా, యూరప్ మార్కెట్లు రెసిషన్ పరిస్తులను ఎదుర్కోవలసి ఉంటుందని వెల్లడించింది. అయితే ఇప్పటికే ఈ అగ్రదేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం దశాబ్దాల గరిష్ఠాలకు చేరుకోవటం సెంట్రల్ బ్యాంకులకు, ప్రభుత్వాలకు పెద్ద ఆందోళనను కలిగిస్తోంది.

తక్కువ నిరుద్యోగిత..

తక్కువ నిరుద్యోగిత..

ఇక్కడ కొంత ఊరటను ఇస్తున్న అంశం ఏమిటంటే.. మాంద్యం వైపు పయనిస్తున్న ప్రపంచంలోని చాలా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో గతంలోని మాంద్యం సమయంతో పోల్చితే నిరుద్యోగిత తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. గతంలోని 2000 డాట్ కామ్ బబుల్, 2008 హౌసింగ్ క్రైసిస్, 2020 కరోనా సంక్షోభంతో పోల్చితే ప్రస్తుతం తక్కువ నిరుద్యోగిత రేటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇది పెరుగుతుందని తేలింది.

 2023లోనూ..

2023లోనూ..

ప్రస్తుతం ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 2022 ప్రారంభం నుంచి వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతూనే ఉన్నాయి. అయితే వ్యాపార వాతావరణంలో కొనసాగుతున్న క్షీణతతో పాటు అంతర్జాతీయంగా ఉన్న ఇతర పరిణామాల కారణంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం కొంత కష్టతరంగా మారింది. ఈ కారణంగా సెంట్రల్ బ్యాంకుల మానిటరీ చర్యలు 2023లోనూ కొన్ని నెలలు కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్ వృద్ధి పరిస్థితి..

భారత్ వృద్ధి పరిస్థితి..

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. 2022లో 3.2% మేర వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. 2020లో కరోనా సమయంలో చైనా వృద్ధి కేవలం 2.2 శాతంగా నమోదు కావటం 1976 నుంచి అత్యల్పమని చెప్పుకోవాలి. భారత్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.9% వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేయబడింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం 6.1% రేటు వృద్ధిని సాధిస్తుందని అంచనాలు చెబుతున్నాయి.

English summary

Recession: మంచి కాలం మించిపోయింది..? జాబ్ క్రియేషన్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే..? | job creation In India dipped For August Month Amid Recession and high Inflation

job creation In India dipped For August Month Amid Recession and high Inflation
Story first published: Wednesday, October 26, 2022, 17:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X