For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఉచిత కాల్స్: 'ఐనా జియో ధరలే తక్కువ'

|

ముంబై: భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు వినియోగదారులకు శుభవార్త అందించిన విషయం తెలిసిందే. ఇతర నెట్ వర్క్‌లకు వర్తించే ఔట్ గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేస్తున్నట్లు ఈ రెండూ ప్రకటించాయి. ఇటీవల మూడు టెలికం సంస్థలు (ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో) టారిఫ్ పెంచడంతో పాటు ఔట్ గోయింగ్ కాల్స్‌పై పరిమితి విధించాయి. ఇప్పుడు దానిని ఎత్తివేస్తున్నట్లు రెండు కంపెనీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో స్పందించింది.

<strong>ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా శుభవార్త: షరతుల్లేవ్, మళ్లీ ఉచిత కాల్స్.. ఎన్నైనా చేసుకోవచ్చు</strong>ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా శుభవార్త: షరతుల్లేవ్, మళ్లీ ఉచిత కాల్స్.. ఎన్నైనా చేసుకోవచ్చు

జియో థ్రెట్

జియో థ్రెట్

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం సంస్థలు ఔట్ గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఇప్పటికీ తమ ధరలే తక్కువగా ఉన్నాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రకటించింది. 350 మిలియన్ల కంటే ఎక్కువగా ఉన్న తమ కస్టమర్లు ఇతరుల కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారని పేర్కొంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్ పెంచి, కాల్స్‌పై పరిమితి ఎత్తివేసినప్పటికీ టెలికం సంస్థల మధ్య టారిఫ్ యుద్ధం తగ్గనట్లుగానే కనిపిస్తోంది. జియో ఇప్పటికీ థ్రెట్‌గా భావిస్తున్నాయి.

ఐదు రెట్లు బెట్టర్

ఐదు రెట్లు బెట్టర్

జియో మాత్రం ఇతర సంస్థల వంటి చర్యను ఇంకా తీసుకోలేదు. జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్‌లో కాల్స్ పరిమితి మిగతా ప్లాన్స్‌తో పోలిస్తే సరాసరిగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. అంటే పరిమితి విషయం పక్కన పెటితే మిగతా ప్లాన్స్ కంటే ఐదు రెట్లు అధికంగా చేసుకోవచ్చు. దీంతో జియో కస్టమర్ ఎప్పుడు కూడా టారిఫ్ చెల్లించాల్సిన అవసరం రాదని అంటున్నారు.

25 శాతం తక్కువ

25 శాతం తక్కువ

ఇతర ఆపరేటర్ల ప్లాన్స్‌తో పోలిస్తే జియో ప్లాన్స్ 25 శాతం అధిక వ్యాల్యూను అందిస్తాయని పునరుద్ఘాటిస్తున్నామని జియో ప్రతినిధి చెప్పారు. రిలయన్స్ టారిఫ్ ఇరవై ఐదు శాతం తక్కువగా ఉంటున్నాయని అంటున్నారు.

English summary

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఉచిత కాల్స్: 'ఐనా జియో ధరలే తక్కువ' | Jio says its rates still cheapest despite Airtel, Vodafone Idea move to remove offnet call limits

Jio said its 350 million plus customers have more than sufficient unlimited call timing before its off net charges kick in. The telco’s stance that it remains the operator with cheaper tariffs on the back of Airtel and Vodafone Idea removing their limits on off net calls, is a sign wars have not abated and Jio remains the threat.
Story first published: Sunday, December 8, 2019, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X