For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jio-BP.. జొమాటో మధ్య భారీ డీల్, దీంతో మీ ఫుడ్ డెలివరీ అస్సలు లేటు కాదు..

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బ్రిటీష్ పెట్రోలియం కంపెనీల మధ్య ఇంధనం & మొబిలిటీ జాయింట్ వెంచర్ అయిన Jio-bp తాజాగా ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటోతో భారీ డీల్ కుదుర్చుకున్నాయి. 2030 నాటికి దేశంలో 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు Zomato ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందంలో భాగంగా చివరి మైలు డెలివరీ కోసం 'జియో-బిపి పల్స్' బ్రాండెడ్ బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌లకు యాక్సెస్‌తో పాటు జోమాటోకు ఈవీ మొబిలిటీ సేవలను అందిస్తామని జియో-బిపి సంయుక్త ప్రకటనలో తెలిపింది. Jio-Bp ఉత్తర భారతంలోని 12 నగరాల్లో EV ఛార్జింగ్, బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ డీల్ వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

'Jio-Bp పల్స్' బ్రాండ్ కింద సేవలు..

'Jio-Bp పల్స్' బ్రాండ్ కింద సేవలు..

2008లో ప్రారంభించబడిన జొమాటో స్టార్టప్ రెస్టారెంట్ సెర్చ్, డిస్కవరీ, రివ్యూలు, ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ టేబుల్ రిజర్వేషన్, డైనింగ్ అవుట్ చేసేటప్పుడు డిజిటల్ పేమెంట్‌లు వంటి సేవలను అందిస్తోంది. వాతావరణ అనుకూల వ్యాపారాన్ని నిర్వహించటంలో భాగంగా.. జొమాటో తన EV ఫ్లీట్‌ను విస్తరించడానికి చూస్తోంది.

అయితే ఇందుకు ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, పరిమిత బ్యాటరీ పరిధి. తాజా భాగస్వామ్యం ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉపకరిస్తుందని, దీర్ఘకాలంలో ఇది తమకు చాలా అవసరమని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.

ఇందుకోసం Jio-Bp.. 'Jio-Bp పల్స్' బ్రాండ్ కింద అందించే ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కంపెనీ వినియోగించుకోనుంది. Jio-bp పల్స్ మొబైల్ యాప్‌తో, కస్టమర్లు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌లను సులభంగా కనుగొనడంతో పాటు వారి EVలను సజావుగా ఛార్జ్ చేయవచ్చు.

ఇంతకు ముందు స్విగ్గీతో డీల్..

ఇంతకు ముందు స్విగ్గీతో డీల్..

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ డెలివరీ, రవాణా విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సిద్ధమౌతోంది. గత సంవత్సరం.. రిలయన్స్ BP మొబిలిటీ, Jio-Bp బ్రాండ్ కింద పనిచేసే సంస్థ.. దేశవ్యాప్తంగా EV బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌ల కోసం అవసరమైన వ్యవస్థను, మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి జొమాటో ప్రధాన ప్రత్యర్థి Swiggyతో డీల్ కుదుర్చుకుంది. డెలివరీ ఫ్లీట్‌ల కోసం తక్కువ ఖర్చుతో కూడిన గ్రీన్ పరిష్కారాలను రూపొందించడంలో సహాయపడటం కూడా ఈ భాగస్వామ్యం లక్ష్యమని తెలుస్తోంది.

మరిన్ని నగరాల్లో ఒప్పందాలు..

మరిన్ని నగరాల్లో ఒప్పందాలు..

Jio-Bpతో పాటు జొమాటో ఎంపిక చేసిన నగరాల్లో Zypp, Eveez, Bud-eతో సహా స్థానిక వెండర్లతో డీల్స్ కలిగి ఉంది. ఇది EV ఫ్లీట్‌ మార్పుకు చేస్తున్న ప్రయత్నాల్లో మద్దతు ఇస్తుంది.

English summary

Jio-BP.. జొమాటో మధ్య భారీ డీల్, దీంతో మీ ఫుడ్ డెలివరీ అస్సలు లేటు కాదు.. | Jio-Bp last year partnered with Swiggy to build an EV battery-swapping station ecosystem

Jio-Bp and food delivery major zomato partnered with mega deal for ev mobility in food delivery
Story first published: Thursday, June 16, 2022, 14:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X