For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ సీఈవో బాధ్యతల నుండి తప్పుకోనున్న జెఫ్ బెజోస్, ఆ తేదీ ఫిక్స్

|

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సీఈవో బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. జూలై 5వ తేదీన చీఫ్ ఎగ్జిక్యూటీవ్ బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు బుధవారం జరిగిన కంపెనీ యాన్యువల్ షేర్ హోల్డర్ మీటింగ్‌లో తెలిపారు. బెజోస్ ఈ బాధ్యతలను ఆండీ జెస్సీ చేతిలో పెట్టనున్నారు. ప్రస్తుతం జాస్సీ అమెజాన్ వెబ్ సిరీస్ బాధ్యతలు చూస్తున్నారు.

తనకు ఉన్న సెంటిమెంట్ కారణంగా జూలై 5వ తేదీని ఎంచుకున్నట్లు తెలిపారు బెజోస్. ఇంటర్నెట్ బుక్‌స్టోర్‌గా మొదలై ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజంగా ఎదిగిన అమెజాన్ 27 సంవత్సరాల క్రితం 1994న అదే తేదీన (జూలై 5) కంపెనీగా ఏర్పడింది. తాను సీఈవో పదవి నుండి వైదొలగుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెజోస్ ప్రకటించారు. కానీ తేదీని ప్రకటించలేదు. తాజాగా తేదీని వెల్లడించారు.

Jeff Bezos will step down as Amazon CEO on July 5

16,700 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ ఆ తర్వాత అమెజాన్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు, కొత్త ఉత్పత్తులపై దృష్టి సారిస్తారు. అలాగే ఆయన తన ఇతర వ్యాపారాలైన బ్లూఆరిజన్, వార్తాపత్రిక వాషింగ్టన్‌ పోస్ట్ వంటి వాటిని చూసుకుంటారు.

English summary

అమెజాన్ సీఈవో బాధ్యతల నుండి తప్పుకోనున్న జెఫ్ బెజోస్, ఆ తేదీ ఫిక్స్ | Jeff Bezos will step down as Amazon CEO on July 5

Amazon founder Jeff Bezos will officially step down from his role as chief executive on July 5, he announced during the company's annual shareholder meeting Wednesday.
Story first published: Friday, May 28, 2021, 10:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X