For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెస్లా షేర్లు 10% డౌన్, 20 రోజుల్లో 4.6 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయిన ఎలాన్ మస్క్

|

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడి స్థాయిని తిరిగి కైవసం చేసుకున్నారు. ఇటీవల టెస్లా ఇంక్ షేర్లు భారీగా లాభపడటంతో ఈ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నిలిచారు. బెజోస్ ఏళ్ళుగా ఆ స్థానంలో ఉంటున్నారు. గత ఏడాది టెస్లా షేర్లు పైపైకి చేరుకోవడంతో మస్క్ ముందుకు వచ్చారు. అయితే తాజాగా టెస్లా షేర్లు నష్టాల్లోకి వెళ్లడంతో జెఫ్ బెజోస్ ఆయనను వెనక్కి నెట్టారు. కరోనా సమయంలో బెజోస్, మస్క్‌ల సంపద భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

2021లో ఇన్వెస్ట్ చేయండి, ఈ ఏడాది బెస్ట్ ప్రభుత్వ పథకాలు.. తెలుసుకోండి2021లో ఇన్వెస్ట్ చేయండి, ఈ ఏడాది బెస్ట్ ప్రభుత్వ పథకాలు.. తెలుసుకోండి

4.6 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది

4.6 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది

టెస్లా ఇంక్ షేర్స్ మంగళవారం 2.4 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సంపద 4.6 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. దీంతో గత మూడేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉంటున్న జెఫ్ బెజోస్ సంపద 191.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎలాన్ మస్క్ కంటే 955 మిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. మస్క్ దాదాపు ఆరు వారాల పాటు ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు. 185 బిలియన్ డాలర్లతో గత నెల ప్రారంభంలో మస్క్ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. తాజాగా మళ్లీ రెండో స్థానానికి పరిమితమయ్యారు.

మళ్లీ నెంబర్ వన్ స్థాయికి రావొచ్చు

మళ్లీ నెంబర్ వన్ స్థాయికి రావొచ్చు

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఇటీవల క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. తన బ్యాలెన్స్ షీట్‌లో 1.5 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని కలిగి ఉంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ అదరగొడుతోంది. అయినప్పటికీ జనవరి 26 నాటి ఆల్ టైమ్ గరిష్టంతో టెస్లా స్టాక్స్ 10 శాతం మేర క్షీణించాయి. మరోవైపు, గత 12 నెలల కాలంలో అమెజాన్ స్టాక్స్ 53 శాతం లాభపడ్డాయి. ప్రస్తుతం టెస్లా షేర్లు క్షీణించడంతో మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. ఈ స్టాక్ మళ్లీ ఎగిసిపడితే తిరిగి నెంబర్ వన్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి.

ఫండ్ రెయిజింగ్

ఫండ్ రెయిజింగ్

ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కోసం, జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు. స్పేస్‌ఎక్స్ వ్యాల్యూను పెంచడానికి ఫండ్ రెయిజింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. గత వారం 850 మిలియన్ల ఫండింగ్‌ను సమీకరించింది. 74 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్ వద్ద దీనిని సమీకరించింది. అంతకుముందు సమీకరించిన దాని కంటే ఇది 60 శాతం ఎక్కువ. గత ఏడాది టెస్లా షేర్ వ్యాల్యూ 743 శాతం కంటే ఎక్కువగా పెరిగింది.

English summary

టెస్లా షేర్లు 10% డౌన్, 20 రోజుల్లో 4.6 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయిన ఎలాన్ మస్క్ | Jeff Bezos regains the world's richest person title as Elon Musk loses over $4 billion

Tesla Inc. shares slid 2.4% on Tuesday, erasing $4.6 billion from its chief executive officer's fortune and knocking him from the top spot on the Bloomberg Billionaires Index ranking.
Story first published: Wednesday, February 17, 2021, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X