For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసలు విషయం ఇదీ!: జెఫ్ బెజోస్‌పై మోడీ ప్రభుత్వానికి అసంతృప్తి ఇందుకేనా?

|

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారత్‌లో మూడ్రోజుల పాటు పర్యటించారు. రూ.7,100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు, దీంతో వేలాది ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు భారత ఈ-కామర్స్ నిబంధనలు ఉల్లంఘించి భారీ ఆఫర్లు ప్రకటిస్తుండటంతో తాము దెబ్బతింటున్నామని చిన్న వ్యాపారులు నిరసనలు చేపట్టారు. బెజోస్ పెట్టుబడుల ప్రకటనపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెఫ్ బెజోస్‌తో ప్రధాని మోడీ సహా, ప్రభుత్వ అధికారులు భేటీ కాలేదు.

అమెజాన్ జెఫ్ బెజోస్ కు ఇండియాలో ఘోర అవమానం?అమెజాన్ జెఫ్ బెజోస్ కు ఇండియాలో ఘోర అవమానం?

మీ ఉద్యోగులకు చెప్పండి...

ఈ విషయాన్ని పక్కన పెడితే జెప్ బెజోస్ చేసిన ఓ ట్వీట్‌ను బీజేపీ ఎంపీ విజయ్ చౌథాయివాలే రీట్వీట్ చేస్తూ ఓ సూచన చేశారు. 'డైనమిజం, ఎనర్జీ, డెమోక్రసీ.. ఇండియన్ సెంచరీ' అని బెజోస్ ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ దీనిని రీట్వీట్ చేస్తూ.. జెఫ్ బెజోస్ వాషింగ్టన్ డీసీలోని మీ ఎంప్లాయీస్‌కు ఈ విషయాన్ని చెప్పండి, లేదంటే మీ డబ్బు, సమయం వృధా అవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎక్కడా ఎవరి పేరు మెన్షన్ చేయలేదు.

అందుకే...

అందుకే...

బీజేపీ ఎంపీ విజయ్ చౌథాయివాలే.. జెఫ్ బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌ను ఉద్దేశించి అన్నట్లుగా తెలుస్తోంది. ఈ న్యూస్ పేపర్ చాలా పక్షపాతం చూపిస్తోందనేది ఆయన ఆరోపణ. ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ పత్రిక తీరు ఏకపక్షంగా ఉందని, పక్షపాతం చూపిస్తోందని అభిప్రాయపడ్డారు. తాను అమెజాన్‌కు వ్యతిరేకం కాదని, కానీ ఈ పత్రిక పక్షపాతం చూపిస్తోందని, తన ఎడిటోరియల్స్‌లలో యాంటీ మోడీ ప్రాపగండాను చూపిస్తోందని ఓ ఇంగ్లీష్ పత్రికతో అన్నారు.

వాషింగ్టన్ పోస్ట్ సీనియర్ ఎడిటర్ స్పందన

విజయ్ చౌథాయివాలే ట్వీట్‌పై వాషింగ్టన్ పోస్ట్ సీనియర్ ఎడిటర్ ఒకరు స్పందించారు. 'కేవలం క్లారిఫై చేసేందుకు మాత్రమే చెబుతున్నాను. వాషింగ్టన్ పోస్ట్‌లో ఏం రాయాలనే అంశాన్ని మాకు జెప్ బెజోస్ సూచించరు.' అని ఎలీ లోపేజ్ అనే సీనియర్ ఎడిటర్ ట్వీట్ చేశారు. మా కరస్పాండెంట్స్, కాలమిస్ట్స్ పనితీరు భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు సరిపోతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.

వాషింగ్టన్ పోస్ట్ పేరు ట్వీట్‌లో పేర్కొనలేదు

వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన ఎలీ లోపేజ్ ట్వీట్‌పై బీజేపీ ఎంపీ విజయ్ తిరిగి స్పందించారు. నా ట్వీట్ చదువుకోవాలని, తాను ఎక్కడా వాషింగ్టన్ పోస్ట్‌ను పేర్కొనలేదని, కేవలం మీ ఉద్యోగులకు చెప్పమని మాత్రమే చెప్పానని అన్నానని, ట్వీట్ చదువుకోవాలన్నారు.

జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్‌పై మోడీ ప్రభుత్వం అసంతృప్తి

జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్‌పై మోడీ ప్రభుత్వం అసంతృప్తి

బీజేపీ ఎంపి విజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు... జెఫ్ బెజోస్‌తో కలిసేందుకు ఎందుకు ఆసక్తి చూపించలేదనే చర్చ సాగుతోంది. అయితే వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తీరుపై మాత్రం మోడీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా అర్థమవుతోందని అంటున్నారు.

English summary

అసలు విషయం ఇదీ!: జెఫ్ బెజోస్‌పై మోడీ ప్రభుత్వానికి అసంతృప్తి ఇందుకేనా? | Jeff Bezos doesn't tell us what to write: Washington Post hits out at BJP leader

Jeff Bezos doesn't tell Washington Post journalists what to write, a senior editor at the publication said in a subtle attack targeted at BJP leader Vijay Chauthaiwale after the latter alleged that the newspaper's editorial policy is highly biased.
Story first published: Sunday, January 19, 2020, 15:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X