For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2009 తర్వాత వరస్ట్, జపాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా డౌన్: కఠిన ఆంక్షలతో మరో'సారీ'

|

కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. 2008-09లోని ఆర్థిక సంక్షోభం కంటే ఎన్నో రెట్లు దెబ్బతిన్న దేశాలు ఉన్నాయి. అయితే చైనా, భారత్, జపాన్ వంటి దేశాలు కరోనా గాయం నుండి కాస్త వేగంగా కోలుకుంటున్నాయి. 2009 తర్వాత మొదటిసారి జపాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. 2020 క్యాలెండర్ ఏడాదిలో వృద్ధి మైనస్ 4.8 శాతంగా నమోదయింది. అయితే వేగంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత త్రైమాసికంలో అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటికే చైనా వృద్ధి రేటు పాజిటివ్‌గా ఉంది. భారత్ కూడా వేగంగా కోలుకుంటోంది. జపాన్ వృద్ధి కాస్త సానుకూలంగా ఉంది.

క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యం చేస్తున్నారా? మీరే నష్టపోతారు.. ఇవి గుర్తుంచుకోండిక్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యం చేస్తున్నారా? మీరే నష్టపోతారు.. ఇవి గుర్తుంచుకోండి

11 ఏళ్ల తర్వాత వృద్ధి రేటు డౌన్

11 ఏళ్ల తర్వాత వృద్ధి రేటు డౌన్

డిసెంబర్ త్రైమాసికంలో జపాన్ వృద్ధి రేటు 12.7 శాతంగా నమోదయింది. మూడో త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదు కావడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాల్లో పాజిటివ్‌గా ఉంది. కరోనా నేపథ్యంలో అంతకుముందు త్రైమాసికాల్లో జపాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించింది. ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు, దేశవ్యాప్తంగా వినిమయం పుంజుకోవడంతో వృద్ధి నమోదయింది.

2020 పూర్తి ఏడాదికి గాను జపాన్ వృద్ధి రేటు మైనస్ 4.8 శాతంగా నమోదయింది. పదకొండేళ్లలో ఆ దేశ వృద్ధి రేటు క్షీణించడం ఇదే తొలిసారి. కరోనా సమయంలో జపాన్‌లో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్, సోషల్ డిస్టెన్స్ వంటి నియమాలను ప్రభుత్వం బాగా ప్రచారం చేసింది.

కఠిన ఆంక్షలతో ఈసారి క్షీణత

కఠిన ఆంక్షలతో ఈసారి క్షీణత

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ ఏడాది ఆరంభంలో కొత్త రకం కరోనా భయాలతో టోక్యోతో పాటు ప్రధాన నగరాల్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ క్వార్టర్‌లో అంచనాలు మించినప్పటికీ, ప్రస్తుత త్రైమాసికంలో తగ్గవచ్చునని భావిస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో సానుకూలంగా ఉండటంతో జపాన్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.

నిక్కీ ర్యాలీ

నిక్కీ ర్యాలీ

జపాన్ సూచీ నిక్కీ 225 మేర ర్యాలీ చేసింది. 30,000 పాయింట్ల మార్కును దాటి ముప్పై సంవత్సరాల గరిష్టాన్ని నమోదు చేసింది. 1990 తర్వాత సూచీ ఈ స్థాయిలో పుంజుకోవడం ఇదే మొదటిసారి. కరోనా కారణంగా గత ఏడాది ప్రారంభంలో నష్టాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటున్నాయి.

English summary

2009 తర్వాత వరస్ట్, జపాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా డౌన్: కఠిన ఆంక్షలతో మరో'సారీ' | Japan's economy performed better than expected in last quarter

Japan's pandemic-hit economy shrank in 2020 for the first time in more than a decade, but the contraction was less than expected and it ended the year on a strong note thanks to a pick-up in exports and huge government support.
Story first published: Monday, February 15, 2021, 18:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X