For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాటర్ రెసిస్టాన్స్ క్లెయిమ్: ఆపిల్‌కు ఇటలీ భారీ జరిమానా

|

టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఇటలీ భారీ జరిమానాను విధించింది. తప్పుదోవ పట్టించే వ్యాపార విధానాలను అనుసరించినందుకు గాను ఇటలీలోని యాంటీట్రస్ట్ అథారిటీ 10 మిలియన్ యూరోల (1.20 లక్షల కోట్ల డాలర్లు) జరిమానాను విధించింది. ఐఫోన్లకు సంబంధించి ఈ విధానాలు అనుసరించినట్లు తెలిపింది. ఇటలీ నియంత్రణ సంస్థలు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాయి. వివిధ ఐఫోన్ మోడల్స్ పైన వాటర్ రెసిస్టాంట్ ప్రాపపర్టీస్‌కు సంబంధించి మిస్ లీడ్ చేసినట్లు జరిమానా విధించినట్లు తెలిపింది.

అమెరికా, చైనా సహా ఈ దేశాలతో భారత్‌లోనే ప్రయాణాలు ఆగిపోయాయిఅమెరికా, చైనా సహా ఈ దేశాలతో భారత్‌లోనే ప్రయాణాలు ఆగిపోయాయి

నిర్దిష్ట పరిస్థితుల్లో ఫీచర్ ఉందని చెప్పలేదు

నిర్దిష్ట పరిస్థితుల్లో ఫీచర్ ఉందని చెప్పలేదు

కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఈ ఫీచర్ ఉంటుందని సదరు యూఎస్ టెక్ దిగ్గజం (ఆపిల్) వెల్లడించలేదని నియంత్రణ సంస్థ పేర్కొంది. దీనిని స్థిర, స్వచ్ఛమైన నీటితో ప్రయోగశాలలో పరీక్షీంచారని, కానీ సాధారణ పరిస్థితిలో ఉపయోగించే నీటితో కాదని పేర్కొంది. iPhone 8, iPhone 8 Plus, iPhone XR, iPhone XS, iPhone XS Max, iPhone 11, iPhone 11pro and iPhone 11 pro Max మోడల్స్‌కు సంబంధించి ప్రచారాల్లో ఆపిల్ దీనిని క్లెయిమ్ చేసింది.

మిస్ లీడ్ చేయడమే

మిస్ లీడ్ చేయడమే

ఆపిల్ సంస్థ పై వివిధ ఐఫోన్ మోడల్స్ పైన ఎలాంటి వివరణలు లేకుండా వాటర్ రెసిస్టాంట్లుగా ప్రచారం చేసిందని, కంపెనీ డిస్‌క్లెమర్‌లో మాత్రం ద్రవ పదార్థాల నుండి ఫోన్ దెబ్బ తింటే వారంటీ వర్తించదని ఉందని పేర్కొంది. దీంతో పాటు నీటిలో పడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎలాంటి నష్ట పరిహారం, సహకారం అందించడం లేదు. స్మార్ట్ ఫోన్ వారంటీపై ఇది కస్టమర్లను మిస్‌లీడ్ చేయడమేనని పేర్కొంది.

ఆపిల్ నిరాకరించడం సరికాదు

ఆపిల్ నిరాకరించడం సరికాదు

వారెంటీ సర్వీస్ అందించడానికి ఆపిల్ నిరాకరించడం సరికాదని అభిప్రాయపడింది. ఈ కారణాల నేపథ్యంలో నియంత్రణ సంస్థ 10 మిలియన్ యూరోల జరిమానాను విధించినట్లు తెలిపింది. దీనిపై ఆపిల్ స్పందించాల్సి ఉంది.

English summary

వాటర్ రెసిస్టాన్స్ క్లెయిమ్: ఆపిల్‌కు ఇటలీ భారీ జరిమానా | Italy fines Apple 10 million euros for misleading water resistance claims

Italy's competition authority said Monday it had fined Apple 10 million euros ($12 million) for misleading claims about the water resistant properties of various iPhone models.
Story first published: Monday, November 30, 2020, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X