For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదేళ్లలోనే ఐటీ సెక్టార్‌కు తొలిసారి! టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాభం జంప్‌కు అవకాశం

|

ముంబై: సాధారణంగా ఐటీ రంగానికి మూడోత్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) బలమైన సీజన్. అయితే ఈసారి అదరగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఏప్రిల్ నుండి అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. కార్యకలాపాలు పుంజుకోవడంతో గత మూడు నాలుగు నెలలుగా రికవరీ కనిపిస్తోంది. కరోనా సమయంలో ఐటీ కంపెనీలు కాస్త ఆశాజనక ఫలితాలు ప్రకటించాయి. ఇప్పుడు రికవరీ ఊపందుకోవడంతో మూడో త్రైమాసికంపై ఐటీ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. గత దశాబ్ద కాలంలో ఓ Q3లో ఐటీ సెక్టార్ అద్భుత ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

సౌదీ అరేబియా కీలక నిర్ణయం, చమురు ధరల షాక్: ధరల కోసం ఒపెక్ దేశాల వ్యూహంసౌదీ అరేబియా కీలక నిర్ణయం, చమురు ధరల షాక్: ధరల కోసం ఒపెక్ దేశాల వ్యూహం

వేతన పెంపు మాత్రమే ప్రభావం చూపవచ్చు

వేతన పెంపు మాత్రమే ప్రభావం చూపవచ్చు

సాధారణంగా Q3లో సెలవులు అధికం. ఔట్ సోర్సింగ్ పైన ఐటీ కంపెనీలు స్వల్పంగా ఖర్చు చేస్తాయి. ఫలితంగా కంపెనీల Q3 ఫలితాలు అంతంత మాత్రమే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనాను తట్టుకొని, డిమాండ్ పెంచుకునేందుకు ఐటీ కంపెనీలు టెక్నాలజీ వినియోగాన్ని మరింతగా పెంచాయి. రెండు, మూడు త్రైమాసికాల్లో ఐటీ కంపెనీలు ఐటీ సేవల కోసం భారీగా ఖర్చు చేశాయి. ఇందుకు అనుగుణంగా భారీ డీల్స్ పెరగడం, కంపెనీల ఆర్డర్ బుక్స్, డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు డిమాండ్ పెరగడం, ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోం వల్ల ఖర్చులు తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. Q3లో వేతన పెంపు మాత్రమే మార్జిన్ పైన ప్రభావం చూపవచ్చునని, ఇతర ఏవీ చూపించవని అంటున్నారు.

టీసీఎస్ ఆదాయం 8 శాతం పెరగవచ్చు

టీసీఎస్ ఆదాయం 8 శాతం పెరగవచ్చు

ఈ రోజు దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ Q3 ఫలితాలు ప్రకటించనుంది. 13వ తేదీన ఇన్ఫోసిస్, విప్రో, 15న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ప్రకటిస్తాయి. ఈసారి ఐటీ ఫలితాలు అదరగొట్టవచ్చుననే అంచనాలతో ఐటీ స్టాక్స్ ఇటీవల జంప్ చేస్తున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల ఆదాయం 2 శాతం నుండి 3 శాతం మేర పెరగవచ్చునని భావిస్తున్నారు. టీసీఎస్ లాభం డిసెంబర్ త్రైమాసికంలో 8 శాతం పెరగవచ్చునని భావిస్తున్నారు. ఆదాయాల్లో 2.7 శాతం నుండి 4.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా. మూడో మధ్యంతర డివిడెండ్ ఇచ్చే అవకాశం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే స్థిర కరెన్సీ రూపంలో టీసీఎస్ ఆదాయం Q3లో 2.4 శాతం నుండి 4 శాతం మేర పెరగవచ్చునని అంచనా. వార్షిక ప్రాతిపదికన నికర లాభం 3 శాతం నుండి 8 శాతం ఉండొచ్చు. చేతిలోని ఆర్డర్ల వ్యాల్యూ, కాలపరిమితి, మార్జిన్లు, ఆదాయ అంచనాలు, రిటైల్, తయారీ, ఇంజినిరింగ్ సేవల విభాగాలపై యాజామన్యం చేసే వ్యాఖ్యలు గమనించాలి. టీసీఎస్ బైబ్యాక్ ద్వారా టాటా సన్స్ కోసం రూ.10,000 కోట్లు సమీకరించింది.

భారీ డీల్స్

భారీ డీల్స్

ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలకు భారీ డీల్స్ దక్కాయి. క్యూ3లో ఇన్ఫోసిస్ కంపెనీ 320 కోట్ల డాలర్ల భారీ ఒప్పందాన్ని దక్కించుకుంది. విప్రో జర్మనీ హోల్ సేల్ దిగ్గజం మెట్రో ఏజీతో 100 కోట్ల డాలర్ల డీల్ కుదుర్చుకుంది. డాయిష్ బ్యాంకు, ఫ్రుడెన్షియల్ సంస్థల నుండి టీసీఎస్ డీల్స్ వచ్చాయి.

English summary

పదేళ్లలోనే ఐటీ సెక్టార్‌కు తొలిసారి! టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాభం జంప్‌కు అవకాశం | IT sector Q3 preview: Large deal wins to boost revenue for TCS

Earnings season for the IT sector is all set to kick start this week with TCS results on Friday. Some analysts believe this quarter's growth could be the best third quarter growth growth for IT players in a decade, with highest-ever order books, marked revenue acceleration and guidance upgrades.
Story first published: Friday, January 8, 2021, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X