For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2012 తర్వాత భారీగా నియామకాలు, విదేశాల నుండి ఆర్డర్స్ పెరుగుదల

|

ఐటీ కంపెనీల్లో నికర నియామకాలు FY22 పెరుగుతాయని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 2011-12 తర్వాత మొదటిసారి భారీగా పెరగనున్నట్లు బ్రోకరేజీ కంపెనీ జేఎం ఫైనాన్షియల్స్ పేర్కొంది. గ్లోబల్ కంపెనీలు డిజిటల్ సేవలను స్వీకరించడంలో వేగవంతంగా ఉండటం, డీల్స్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు డిమాండ్ పెరగడం వంటివి కారణంగా పేర్కొంటున్నారు. 2020-21ని భారతీయ ఐటీ కంపెనీలకు ట్రాన్స్‌ఫార్మేటివ్ కంపెనీగా మారింది.

అనరాక్ రిపోర్ట్: హౌసింగ్ సేల్స్ జంప్, 64 శాతంతో హైదరాబాద్ టాప్అనరాక్ రిపోర్ట్: హౌసింగ్ సేల్స్ జంప్, 64 శాతంతో హైదరాబాద్ టాప్

బోనస్, వేతన పెంపు

బోనస్, వేతన పెంపు

కరోనాతో ఐటీ ఉద్యోగాల తీరు మారింది. సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. ఇదే సమయంలో కంపెనీలకు విదేశాల నుండి వస్తోన్న ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి అధికంగా ఉండే అవకాశముందనే అంచనాలు ఉన్నాయి. దీనికి తగినట్లు ప్రముఖ ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ఐటీ నిపుణులు అట్టిపెట్టుకునేందుకు బోనస్, వేతన పెంపును అమలు చేస్తున్నాయి.

లక్షల ఉద్యోగాలు

లక్షల ఉద్యోగాలు

కరోనా అనంతరం వేగంగా కోలుకున్న రంగాల్లో ఐటీ రంగం ముందు ఉంది. ఇందుకు ప్రధాన కారణం అనేక సంస్థలు తమ వ్యాపారాల్ని డిజిటల్ రూపంలోకి మార్చేందుకు ప్రయత్నించడం. దేశీయ ఐటీ దిగ్గజాలు TCS, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, HCL టెక్నాలజీస్ వంటి సంస్థలు ఈ అవకాశాన్ని పూర్తిగా చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ సంస్థల ఆఫ్ షోర్ ఆదాయాలు 5 శాతం వరకు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అంచనా. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ 5 కంపెనీలు లక్షన్నర మంది ఉద్యోగుల్ని నియమించుకుంటాయని అంచనా.

2012 తర్వాత భారీగా నియామకాలు

2012 తర్వాత భారీగా నియామకాలు

2012 తర్వాత ఇంత భారీ ఎత్తున నియామకాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.తక్కువ ఖర్చుతో పనిని పూర్తి చేయడంపై విదేశీసంస్థల దృష్టి సారించాయి. కరోనా వల్ల అమెరికాతో సహా పలు దేశాల్లో సంస్థలు గతేడాది మూతపడ్డాయి. అవన్నీ ఇప్పుడు తిరిగి వ్యాపారాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. తక్కువ బడ్జెట్‌లో డిజిటల్ కార్యకలాపాలు సాకారం చేసుకునేందుకు థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడుతున్నాయి. అందుకే, భారత్‌లోని సంస్థలపై అవి దృష్టి సారిస్తున్నాయి. తమ ప్రాజెక్టుల్ని ఇక్కడి సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఆఫ్ షోర్ ప్రాజెక్టులు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు.

English summary

2012 తర్వాత భారీగా నియామకాలు, విదేశాల నుండి ఆర్డర్స్ పెరుగుదల | IT sector hiring could hit decade high in FY22, lead to margin pressure

Indian IT companies' net hiring in FY22 could hit the highest number of workers in a financial year since the heydays of 2011-12, brokerage firm JM Financial said in a note released on Monday.
Story first published: Sunday, March 28, 2021, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X