For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Jobs: 50 శాతం కిందకు ఐటీ ఉద్యోగాలు.. మూడేళ్లలో తొలిసారిగా.. లేటెస్ట్ రిపోర్ట్..

|

IT Jobs: ఈ రోజుల్లో మంచి ఉద్యోగం అంటే ఒకటి సాఫ్ట్ వేర్ లేదా రెండోది డాక్టర్ అన్నట్లుగా సొసైటీ ఉంది. అయితే జాబ్ మార్కెట్లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తాజా రిపోర్ట్స్ ఏమి చెబుతున్నాయనో పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

వైట్ కాలర్ జాబ్స్..

వైట్ కాలర్ జాబ్స్..

గత మూడేళ్లలో తొలిసారిగా ఈ అక్టోబర్ మాసంలో వైట్ కాలర్ జాబ్స్ మార్కెట్‌లో భారతీయ ఐటీ రంగం వాటా 50% కంటే దిగువకు పడిపోయింది. లింక్డ్‌ఇన్ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో IT రంగం 1,06,000 యాక్టివ్ జాబ్ వేకెన్సీలను పోస్ట్ చేసింది. ఇది సెప్టెంబర్‌లో 1,21,000గా ఉంది. అంటే కేవలం ఒక్క నెలలో ఐటీ ఉద్యోగ నియామకాల సంఖ్య ఏకంగా 12% పతనమైంది.

ఇతర ఉద్యోగాలు..

ఇతర ఉద్యోగాలు..

ఇతర వైట్ కాలర్ ఉద్యోగాలనతో పోల్చి చూస్తే ఐటీ పరిస్థితి దిగజారింది. అయితే ఇదే సమయంలో ఇతర యాక్టివ్ ఉద్యోగ అవకాశాలు 5 నెలల కాలంలో తొలిసారిగా అక్టోబర్‌లో 2,25,000కి పెరిగాయి. గడిచిన రెండు త్రైమాసికాల్లో వివిధ రంగాల్లో 80 లక్షల ఉద్యోగాల భర్తీకి పోస్ట్ చేయటంతో నియామకాల్లో భారీ పెరుగుదల నమోదైంది.

ఐటీ రంగం మాత్రం..

ఐటీ రంగం మాత్రం..

ఐటి సేవల రంగం అక్టోబర్‌లో 60,000 యాక్టివ్ ఓపెనింగ్‌లతో డీలా పడింది. నియామకాల్లో వాల్యూమ్ ఏకంగా 14 శాతం తగ్గింది. ఇది గడచిన 22 నెలల్లోనే కనిష్ఠమైన సంఖ్య. ఆగష్టు మాసంలో IT సేవల సంస్థల నుంచి ఉద్యోగ నియామకాల్లో 10% తగ్గింపు ఉన్నట్లు Naukri.com వెల్లడించింది.

కరోనాకి ముందు..

కరోనాకి ముందు..

దేశంలో కరోనా మహమ్మారికి ముందు వైట్ కాలర్ జాబ్స్ మార్కెట్‌లో ఐటీ రంగం 80 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం మాంద్యం, పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్త నియామకాలకు తాత్కారికంగా బ్రేక్ చెప్పాయి. అమెరికా, యూరోప్, జపాన్, చైనా వంటి కీలక మార్కెట్లలో వృద్ధి క్షీణించటం.. పెద్ద టెక్ కంపెనీలు సైతం రిక్రూట్ మెంట్ ప్లాన్లను తగ్గించుకుంటున్నాయి.

ఇతర రంగాల పరిస్థితి..

ఇతర రంగాల పరిస్థితి..

అక్టోబర్‌లో నాన్-టెక్ సెక్టార్లో 53% యాక్టివ్ ఉద్యోగాలు, ఆతిథ్యం & పర్యాటకం, బ్యాంకింగ్ అండ్ ఆర్థిక సేవలు, తయారీ, ఆరోగ్య సంరక్షణ, ఆటోమోటివ్, ఆయిల్ & ఎనర్జీ, టెలికాం రంగాలు వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ రంగాల్లో కొత్త నియామకాలు భారీగానే ఉన్నాయని తెలుస్తోంది. ఏదైమైనప్పటిక ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై నీలినీడలు అలుముకున్న నేపథ్యంలో మరికొన్ని నెలలు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

IT Jobs: 50 శాతం కిందకు ఐటీ ఉద్యోగాలు.. మూడేళ్లలో తొలిసారిగా.. లేటెస్ట్ రిపోర్ట్.. | IT Recruitments In White Collar jobs Fell drastically in october report says

IT Recruitments In White Collar jobs Fell drastically in october report says
Story first published: Saturday, November 5, 2022, 12:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X