For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్టప్స్‌లో ఉద్యోగాల కోత, ఐటీ సేఫ్... దిగ్గజ కంపెనీల వైపు చూపు

|

స్టార్టప్స్‌లలో ఉద్యోగాల కోత ఎక్కువగా కనిపిస్తోందట. గత ఐదు నెలల కాలంలో పలు స్టార్టప్స్ దాదాపు ఎనిమిది వేల ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఐటీ జాబ్స్.... స్టార్టప్స్ కంటే సేఫ్‌గా ఉన్నాయని అంటున్నారు. ఐటీ ఉద్యోగాలు సేఫ్‌గా ఉన్నప్పటికీ, వేతన పెంపు కోసం మాత్రం వేచి చూడాల్సి వస్తోందట. స్టార్టప్స్‌లో బ్లింకిట్, ఓలా, వైట్ హ్యాట్ జూనియర్, అన్ఎకాడమీ, కార్స్ 24, వేదాంతు, మీషో, ట్రెల్, ఫర్‌లెన్కో వంటి పలు స్టార్టప్స్ ఉద్యోగుల్ని తొలగించాయట.

స్టార్టప్స్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు మున్ముందు ఇరవై వేలకు చేరుకోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కరోనా అనంతరం ఫండింగ్ తగ్గడం వల్ల స్టార్టప్స్ రంగంలో ఒత్తిడి కనిపిస్తోందని, నిధుల లభ్యత మళ్లీ మెరుగుపడేందుకు కనీసం ఆరు నుండి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చునని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆయా స్టార్టప్స్ తమ చేతుల్లోని నగదును పొదుపుగా వినియోగిస్తున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగాల కోత కనిపిస్తోంది.

 IT jobs are safer than startup job

కరోనా ఆంక్షలు తగ్గాయి. దీంతో విద్యార్థులు మళ్లీ స్కూళ్లకు వెళ్తున్నారు. దీంతో ఆన్ లైన్ బోధనకు డిమాండ్ కరోనా సమయం కంటే తగ్గింది. ఇది ఎడ్యుటెక్ వంటి స్టార్టప్స్ పైన ఒత్తిడికి కారణమైంది. దాదాపు అన్ని స్టార్టప్స్ పరిస్థితి అంతే. దీంతో టెక్ నిపుణులు మళ్లీ ఐటీ ఉద్యోగాల్లో చేరుతున్నారని చెబుతున్నారు. స్టార్టప్స్‌ను వీడుతున్న సగం మంది ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీలు, గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్‌లలో చేరుతున్నట్లు చెబుతున్నారు.

ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు 11 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ వర్క్ చేస్తున్నారు. ఇందులో FY22లోనే 2.3 లక్షల మందిని నియమించుకున్నాయి. 2022లో అత్యధిక ఉద్యోగ నియామకాలు చేపట్టిన రంగం ఐటీ. టాప్ 10లోని ఏడు ఐటీ సంస్థలు నియామకాలు వేగవంతం చేశాయి.

English summary

స్టార్టప్స్‌లో ఉద్యోగాల కోత, ఐటీ సేఫ్... దిగ్గజ కంపెనీల వైపు చూపు | IT jobs are safer than startup job

Even as the Indian startup job crisis looms large, the startup-adjacent IT sector might not go the same layoff route, if experts are to be believed.
Story first published: Sunday, May 29, 2022, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X