For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wipro: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ఐటీ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న విప్రో కంపెనీ.. పూర్తి వివరాలు

|

Wipro IT Jobs: అసలే ఈ మధ్య కాలంలో ఐటీ ఉద్యోగుల రాజీనామాలు భారీగా పెరిగాయి. కంపెనీలు దీనిని భర్తీ చేసేందుకు ఫెషర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలో వారిని భారీగా నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సదవకాశాన్ని తీసుకొచ్చింది. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) ప్రోగ్రామ్ 2022 కింద.. 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన BCA, BSc విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే..?

విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే..?

విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్-2022 అంటే ఏమిటో ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి. ఒకవేళ మీరు డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకుంటున్నట్లయితే ఇది మీకు సదవకాశమని చెప్పుకోవాలి. ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన సంపాదనతో పాటు మరోపక్క చదువును కూడా కొనసాగించాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. WILP ప్రోగ్రామ్ ద్వారా.. BCA, B.Sc విద్యార్థులు ఉద్యోగం చేసుకుంటూనే.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ నుంచి M.Techలో ఉన్నత విద్యను పూర్తి చేసే అవకాశాన్ని విప్రో అందిస్తోంది.

విద్యార్హతలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా..

విద్యార్హతలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా..

• 10వ తరగతి: Pass

• 12వ తరగతి: Pass

• గ్రాడ్యుయేషన్ - యూనివర్సిటీ మార్గదర్శకాల ప్రకారం 60% మార్కులు లేదా 6.0 CGPA కలిగి ఉండాలి.

• పాస్ అయిన సంవత్సరం: 2021, 2022

• బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ - BCA పూర్తి చేసి ఉండాలి లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్- B.Sc ఉత్తీర్ణులై ఉండాలి

శాలరీ ప్యాకేట్ వివరాలు..

శాలరీ ప్యాకేట్ వివరాలు..

• CTC: నెలకు INR 15,488.00

• మెుదటి సంవత్సరం స్టైఫండ్‌ - 15,000 + 488(ESI) + జాయినింగ్ బోనస్ రూ.75 వేలు

• రెండవ సంవత్సరం సంవత్సరం స్టైఫండ్‌ - 17,000 + 553(ESI)

• 3వ సంవత్సరం స్టిపెండ్ - 19,000 + 618(ESI)

• నాల్గవ సంవత్సరం : 23,000

కార్యక్రమం పూర్తయిన తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదా పొందుతారు. సదరు ఉద్యోగి పనితీరును బట్టి జీతం ఏడాదికి రూ.6,00,000 నుంచి ఉంటుంది.

భారతీయ పౌరసత్వం..

భారతీయ పౌరసత్వం..

కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడిన 10వ, 12వ & గ్రాడ్యుయేషన్‌లో ఫుల్ టైమ్ రెగ్యులర్ విద్యను పూర్తి చేసి ఉండాలి. కేవలం ఒక్క బ్యాక్ లాగ్ మాత్రమే కంపెనీ అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న సందర్భంలో.. PIO, OCI కార్డ్‌ని కలిగి ఉండాలి. భూటాన్, నేపాల్ జాతీయులైతే వారు తమ పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.

ఇంతకు ముందు ఇంటర్వ్యూకు వస్తే..?

ఇంతకు ముందు ఇంటర్వ్యూకు వస్తే..?

గడచిన మూడు నెలల కాలంలో విప్రో నిర్వహించిన ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్ కు అనర్హులని కంపెనీ తెలిపింది. జూన్ 30, 2022 నాటికి మొత్తం 2,58,574 మంది ఉద్యోగులతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విప్రో 15,000 మంది ఉద్యోగులను తమ సంస్థలో చేర్చుకుంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,43,128గా ఉంది.

దరఖాస్తు.. అర్హత ప్రమాణాలు..

దరఖాస్తు.. అర్హత ప్రమాణాలు..

పైన తెలిపిన విద్యార్హతలు కలిగిన వ్యక్తి ఎవరైన ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు 31 ఆగస్టు 2022 11:59 PM వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. దీనికోసం అభ్యర్థి గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్‌ని ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.

బిజినెస్ మ్యాథ్స్ & అప్లైడ్ మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్‌గా పరిగణించబడవు. 10వ తరగతి పూర్తైన తర్వాత గ్రాడ్యుయేషన్ మధ్యలో గరిష్థంగా 3 సంవత్సరాలు మాత్రమే గ్యాప్ అనుమతించబడుతుంది. గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు గ్యాప్ వస్తే దానిని కంపెనీ పరిగణలోకి తీసుకోమని స్పష్టంగా తెలిపింది.

English summary

Wipro: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ఐటీ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న విప్రో కంపెనీ.. పూర్తి వివరాలు | it company Wipro Hiring BCA, BSc Graduates as freshers for software jobs under WILP programme

it company Wipro Hiring BCA, BSc Graduates as freshers for software jobs under WILP programme..
Story first published: Monday, August 29, 2022, 19:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X