For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT News: ఉద్యోగుల తొలగింపు ఉండదు.. ఐటీ కంపెనీ బంపర్ ప్రకటన.. ఎంప్లాయస్ హ్యాపీ..

|

IT News: ఇటీవలి కాలంలో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితుల్లో వారు కాలం గడుపుతున్నారు. జీతాల పెంపు పక్కన పెడితే.. అసలు కంపెనీలు వేరియబుల్ పే పూర్తిగా చెల్లిస్తాయా లేదా అనే అనుమానాలు సైతం పెరిగాయి. ఇలాంటి సందర్భంలో భారత ఐటీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకటిగా మారిన రెండు కంపెనీలు..

ఒకటిగా మారిన రెండు కంపెనీలు..

ప్రస్తుతం సంక్షోభంలో భారత ఐటీ మార్కెట్ ఉంది. ఈ క్రమంలో దేశంలోని రెండు ప్రముఖ ఐటీ కంపెనీలైన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్ ట్రీ తమ విలీనాన్ని కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాయి. కంపెనీల విలీనంతో మెరుగైన సేవలు అందించవచ్చని తెలుస్తోంది. అయితే రెండు కంపెనీల విలీనంతో వీటి ఉద్యోగుల పరిస్థితి ఏమిటనే ఆందోళనలు సైతం తలెత్తుతున్నాయి.

ఉద్యోగులు సేఫేనా..?

ఉద్యోగులు సేఫేనా..?

ఎప్పుడైనా కొత్త కంపెనీల కొనుగోలు సమయంలో ఉద్యోగులపై ప్రభావం ఉంటుంది. కొన్ని కంపెనీలు ఉన్న ఉద్యోగులను తొలగిస్తుంటాయి. ఇటీవల ట్విట్టర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టీ గ్రూప్ మైండ్ ట్రీని పూర్తిగా అనుసంధానం చేసింది. సెబీకి అందించిన వివరాల ప్రకారం కంపెనీలో మెుత్తం 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇకపై వీరందరూ కలిసి పనిచేయనున్నారు.

అతిపెద్ద కంపెనీగా..

అతిపెద్ద కంపెనీగా..

కంపెనీలు ప్రస్తుతం 750 కంటే ఎక్కువ క్లయింట్‌లకు సేవలు అందిస్తోంది. ఈ విజయవంతమైన విలీనం తర్వాత.. మార్కెట్ విలువ ప్రకారం కంపెనీ దేశంలోనే 5వ అతిపెద్ద ఐసీ సేవల కంపెనీగా అవరించనుంది. ఆదాయం పరంగా కంపెనీ ఆరో అతిపెద్ద కంపెనీగా మారనుంది. కస్టమర్‌లకు అనుకూలంగా మా సేవలను గతంలో కంటే వేగంగా పూర్తి చేయడానికి మేము కలిసి పని చేస్తామని LTIMindtree చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేబాషిస్ ఛటర్జీ మీడియాకు వెల్లడించారు.

ఉద్యోగుల తొలగింపు..

ఉద్యోగుల తొలగింపు..

జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలో ఉద్యోగుల తొలగింపు అడిగిన ప్రశ్నకు ఛటర్జీ బదులిచ్చారు. విలీనం తర్వాత ఉద్యోగులను తొలగించే ఉద్ధేశ్యం లేదని వెల్లడించారు. అట్రిషన్ పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మార్కెట్లో అది సర్వసాధారణమైన విషయమని అన్నారు. సీనియర్ అధికారులు ఎవ్వరూ కంపెనీని వీడలేదని.. దీంతో ఎలాంటి ఇబ్బింది లేదని చెప్పారు.

English summary

IT News: ఉద్యోగుల తొలగింపు ఉండదు.. ఐటీ కంపెనీ బంపర్ ప్రకటన.. ఎంప్లాయస్ హ్యాపీ.. | it company ltimindtree ceo says there is no layoffs with companies merger

it company ltimindtree ceo says there is no layoffs with companies merger
Story first published: Wednesday, November 16, 2022, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X