For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Firing Secret: కొత్త టెక్నిక్ వాడుతున్న IT కంపెనీలు.. అలా గుర్తించి ఇలా తొలగింపు.. జాగ్రత్త టెక్కీలు..

|

IT Firing: దేశంలోని ఐటీ కంపెనీలను కుదిపేస్తున్న మూన్‌లైటింగ్ వివాదంలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో విప్రో తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల్లో 300 మందిని తొలగించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కంపెనీ ఏ ప్రాతిపదికన లేదా ఎలా రెండు ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలను గుర్తిస్తోంది అన్నదే చాలా ఆందోళన కలిగించిన విషయం. ఇది ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర టెన్షన్ క్రియేట్ చేస్తోంది.

మూన్‌లైటర్స్ విషయంలో..

మూన్‌లైటర్స్ విషయంలో..

మూన్‌లైటింగ్ కి పాల్పడే వారి విషయంలో విప్రో తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవటానికి ముందు రెండు ఉద్యోగాలు చేస్తున్నవారిని గుర్చించటానికి కొత్త టెక్నిక్ ఫాలో అవుతున్నాయి.

UAN నంబర్ ఆధారంగా..

UAN నంబర్ ఆధారంగా..

తమ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకోవటానికి కంపెనీలకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి UAN ద్వారా తెలుసుకోవటం. దీనిలోని సమాచారాన్ని యాక్సెస్ చేయటం ద్వారా కంపెనీలు మాటవినని టెక్కీలను గుర్తించవచ్చు.

ఇతర మార్గాలు ఏమిటి..?

ఇతర మార్గాలు ఏమిటి..?

కంపెనీలు ఫుల్ టైం ఉద్యోగుల విషయంలో మాత్రమే UAN ద్వారా ట్రేస్ చేయడం సాధ్యమవుతుందని తెలుస్తోంది. దీనికి తోడు ఉద్యోగులు ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను పర్యవేక్షించడం మరొక కీలక మార్గమని తెలుస్తోంది. మీరు కంపెనీ ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నట్లయితే.. అది సర్వర్‌లో నమోదు చేయబడుతుంది. దీని ద్వారా కంపెనీ తన ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తుంటాయి.

ఇది సరైనదేనా?

ఇది సరైనదేనా?

EPF సైట్‌లో అటువంటి డేటా కనుగొనబడితే చర్య తీసుకునే హక్కు కంపెనీకి ఉంది. ఈ విధంగా మీరు రెండు వైపుల నుంచి ఆఫర్లను పొందుతున్నారని గుర్తిస్తాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఇది పెద్ద ఉల్లంఘన. అయితే భారత్‌లో ఇది అంత కఠినంగా లేదు.

నిశితంగా పర్యవేక్షణ..

నిశితంగా పర్యవేక్షణ..

కరోనా తర్వాత ఎక్కువ మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నందున ఎక్కువ మంది ఫ్రీలాన్సింగ్, లేదా మరో కంపెనీకి సైతం చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో కంపెనీలు ఉద్యోగులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. విప్రో లాగానే IBM, Infosys, Tech Mahindra లాంటి కంపెనీలు మూన్‌లైటింగ్ గురించి తమ ఉద్యోగులను హెచ్చరించాయి. కంపెనీ నిబంధనలు అతిక్రమించే టెక్కీలకు సమస్యలు తప్పవని చెప్పుకోవాలి. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్ఫోసిస్ ఇప్పటికే తేల్చి చెప్పింది.

భవిష్యత్తు పరిణామాలు..?

భవిష్యత్తు పరిణామాలు..?

ఐటీ పరిశ్రమలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో టెక్కీలు మాటవినకపోవటాన్ని కంపెనీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఉద్యోగులు మూన్‌లైటింగ్‌ను బహిరంగంగా నిర్వహించాలని, దానిని సక్రమంగా చేపట్టడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని నాస్కామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

శాశ్వత పరిష్కారం ఏమిటంటే..?

శాశ్వత పరిష్కారం ఏమిటంటే..?

మూన్‌లైటింగ్‌ విషయంలో ఉద్యోగుల నుంచి పారదర్శకత లేకపోవటం కంపెనీల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఫుల్ టైం ఎంప్లాయిగా ఉంటూ.. దాని గురించి కంపెనీలకు ఉద్యోగులు చెప్పకపోతే అవి సమస్యలకు కారణంగా మారుతున్నాయి. కాబట్టి దీనిపై యాజమాన్యాలు, ఉద్యోగులు కలిసి చర్చించుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Read more about: it firing it news jobs business news
English summary

IT Firing Secret: కొత్త టెక్నిక్ వాడుతున్న IT కంపెనీలు.. అలా గుర్తించి ఇలా తొలగింపు.. జాగ్రత్త టెక్కీలు.. | it companies using uan number to detect employees involved in moonlighting know full details

it companies using uan number to detect employees involved in moonlighting know full details
Story first published: Monday, October 3, 2022, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X