For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL టెక్‌లలో FY22లో 1.1 లక్షల కొత్త ఉద్యోగాలు

|

FY22లో తాము కొత్తగా 20,000 నుండి 22,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని HCL టెక్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ వీవీ అప్పారావు చెప్పారు. ఈ ఏడాది నియామకాలు ఈ సంఖ్య దాటినా ఆశ్చర్యం లేదని చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికంలో 6వేల మంది కొత్తవారిని నియమించుకుంటామన్నారు. ఈ త్రైమాసికంలో ఉద్యోగులందరికీ 100% వ్యాక్సీన్ వేయించనున్నామని, ఇప్పటికే 74 శాతం పూర్తయిందన్నారు. HCL టెక్ రూ.2 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేర్‌కు 300 శాతం మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డ్ నిర్ణయించింది. డివిడెండ్ చెల్లింపుకు జూలై 28ని రికార్డ్ తేదీగా నిర్ణయించారు.

HCL టెక్ ఉద్యోగుల సంఖ్య

HCL టెక్ ఉద్యోగుల సంఖ్య

2021 జూన్ త్రైమాసికం చివరి నాటికి కంపెనీలో మొత్తం పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య 1,76,499కు చేరుకుంది. నికరంగా 7,522 మంది చేరారు. ఉద్యోగ వలసల రేటు 11.8 శాతంగా నమోదయింది. ఇదిలా ఉండగా, ఐబీఎం ఇండియా మాజీ ఎండీ, చైర్మన్ వనితా నారాయణ్‌ను అదనపు డైరెక్టర్‌గా HCL టెక్ బోర్డులోకి తీసుకున్నారు. ఈమె స్వతంత్ర డైరెక్టర్ హోదాలో కొనసాగుతారని కంపెనీ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది.

ఏ ఐటీ దిగ్గజం ఎన్ని ఉద్యోగాలు ఇవ్వవచ్చు

ఏ ఐటీ దిగ్గజం ఎన్ని ఉద్యోగాలు ఇవ్వవచ్చు

ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐటీ కంపెనీలు అన్నీ వేలాది ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ 35,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ 21,000 ఉద్యోగాలు ఇచ్చింది. విప్రో గత ఏడాది కంటే 33 శాతం ఎక్కువగా అంటే 12,000 ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది. HCL టెక్ ఈ ఆర్థిక సంవత్సరంలో 22వే వరకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది. గత ఏడాది ఇచ్చిన 14600 కంటే ఇవి 50 శాతం ఎక్కువ. టీసీఎస్ 40వేల ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది.

లక్షకు పైగా ఉద్యోగాలు

లక్షకు పైగా ఉద్యోగాలు

దేశంలోని టాప్ ఫోర్ ఐటీ కంపెనీలు జూన్ త్రైమాసికంలో 48,443 ఉద్యోగులను నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ 1.1 లక్షల మంది ఉద్యోగులను నియమించుకోనుంది. వివిధ ఐటీ కంపెనీలకు జూన్ త్రైమాసికంలో పెద్ద డీల్స్ కుదిరాయి. టీసీఎస్ 8.1 బిలియన్ డాలర్లు, ఇన్ఫోసిస్ 2.6 బిలియన్ డాలర్లు, విప్రో 715 డాలర్లు, హెచ్‌సీఎల్ టెక్ 1.67 బిలియన్ డాలర్ల డీల్స్ కుదిరాయి.

English summary

TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL టెక్‌లలో FY22లో 1.1 లక్షల కొత్త ఉద్యోగాలు | IT companies to hire over 1.1 lakh freshers this year

Indian IT firms have stepped up fresher hiring for FY22 by an average 30% to a combined 1.1 lakh on the back of growing demand as businesses goes digital and increased attrition.
Story first published: Tuesday, July 20, 2021, 14:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X