For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Companies Growth: ఇక ఐటీ కంపెనీలకు కష్టమే.. వృద్ధి తగ్గే అవకాశం..!

|

గత రెండేళ్లుగా భారీ ఆదాయాలతో దూసుకెళ్లిన ఐటీ కంపెనీలు.. ఈ ఆర్థిక సంవత్సరంలో తడపడే అవకాశం ఉందని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 19 శాతంగా ఉన్న ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి.. 2022-23లో 12-13 శాతానికి పరిమితమవ్వొచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ఖర్చులు పెరగడమే కారణంగా విశ్లేషించింది. ఉద్యోగుల జీతభత్యాలు, ప్రయాణ వ్యయాల కారణంగా సంస్థల మార్జిన్లు కూడా 24 శాతం నుంచి 22-23 శాతానికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడిల నేపథ్యంలో కార్పొరేట్‌ సంస్థలు ఐటీ వ్యయాలు తగ్గించుకుంటుండటమే ఇందుకు కారణమని వివరించింది.

IT companies revenue growth to slide sharply in FY23, says report

రెండంకెల వృద్ధి
రూపాయి బలహీన పడటం, కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి కొత్త తరం టెక్నాలజీలకు బలమైన గిరాకీ ఉండటంతో రెండంకెల వృద్ధి సాధించవచ్చని అంచనా వేసింది. దేశీయ ఐటీ సంస్థల ఆదాయంలో దాదాపు 85 శాతం అమెరికా, ఐరోపా దేశాల నుంచే వస్తోంది. వచ్చే మూడేళ్లలో క్లౌడ్‌ మౌలిక సదుపాయాలపై వ్యయాలు 1.5 రెట్లు పెరగొచ్చని, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి కొత్త తరం టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం ఇందుకు దోహదపడుతుందని క్రిసిల్‌ డైరెక్టర్‌ ఆదిత్య జవేర్‌ చెప్పారు.

English summary

IT Companies Growth: ఇక ఐటీ కంపెనీలకు కష్టమే.. వృద్ధి తగ్గే అవకాశం..! | IT companies' revenue growth to slide sharply in FY23, says report

The information technology services sector will see a sharp fall in revenue growth to 12-13 per cent in FY23 from 19 per cent in FY22, ratings agency Crisil said on Thursday.
Story first published: Friday, July 8, 2022, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X