భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని వివిధ ఐటీ కంపెనీలు కోవిడ్ కేర్ సౌకర్యాలు విస్తరించడంతో పాటు ఉద్యోగులకు అండగా ఉండేందుకు అదనంగా పెయిడ్ లీవ్స్ కూడా ఇస్తున్నాయి. కరోనా వైరస్ సోకిన వారికి లేదా ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటున్న వారికి 21 రోజుల పాటు పెయిడ్ లీవ్ మంజూరు చేస్తున్నట్లు భారత రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తెలిపింది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల కోవిడ్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది.

కోవిడ్ సెంటర్స్
ఇన్ఫోసిస్ పుణే, బెంగళూరు నగరాల్లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పుణేలోని ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను స్థానిక రూబీ హాల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, బెంగళూరు కేంద్రాన్ని మణిపాల్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నాయి. గ్రూప్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కింద కోవిడ్ సంబంధిత వైద్య చికిత్సలను కవర్ చేస్తున్నారు.

అవగాహన ఒప్పందం
ఇన్ఫోసిస్ టెస్టింగ్ ల్యాబ్స్ తో కూడా అవగాహన కుదుర్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల చికిత్స కోసం 242 నగరాల్లోని 1,490 ఆసుపత్రులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నది. కొవిడ్ సోకిన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీని వర్తింప చేస్తోందని క్యాప్‌జెమిని పేర్కొంది.

విప్రో సైతం
మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఉద్యోగుల కోసం గతవారం వ్యాక్సినేషన్ క్యాంప్‌ను నిర్వహించింది. విప్రో వెల్ నెస్ ప్లాట్‌ఫాంను కూడా లాంచ్ చేసింది. డాక్టర్లు, హెల్త్ సూచనలు, వర్చువల్ కన్సల్టేషన్స్, 24X7 ఎమర్జెన్సీ కేర్ ఎక్స్‌పర్ట్స్ సేవలు అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications