For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Salary Cutting: ఉద్యోగులను తొలగించడమే కాదు.. జీతాలు కూడా తగ్గిస్తున్న ఐటీ కంపెనీలు..

|

ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఐటీ మేనేజ్‌మెంట్‌లు ఇప్పుడు ఖర్చులను తగ్గించడానికి CEO జీతాలను తగ్గించడం ప్రారంభించాయి. అధిక ఆదాయాలు, లాభాలు ఉన్నప్పటికీ టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

పనితీరు షేర్ యూనిట్‌లు

పనితీరు షేర్ యూనిట్‌లు

డిసెంబర్‌లో గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మేనేజ్‌మెంట్ ఆమోదించిన కొత్త వేతన విధానంలో సుందర్ పిచాయ్‌ మొత్తం జీతంలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్న పనితీరు షేర్ యూనిట్‌ల నిష్పత్తి 43 శాతం నుంచి 60 శాతానికి పెంచింది.

ఆన్ టార్గెట్ పనితీరు స్టాక్ యూనిట్ల చెల్లింపు మొత్తంలో పనితీరులో 50 శాతం నుంచి 55 శాతానికి పెంచారు.

టిమ్ కుక్

టిమ్ కుక్

పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం 2023లో తన జీతంలో 40 శాతం తగ్గించుకున్నారు Apple CEO అయిన టిమ్ కుక్. ప్రస్తుతం 49 మిలియన్ డాలర్ల జీతం మాత్రమే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జీతం కోత కోసం టిమ్ కుక్ ను యాజమాన్యం కోరనప్పటికీ ఆయన తన జీతాన్ని తగ్గించుకున్నాడు.

$99.4 మిలియన్లు

$99.4 మిలియన్లు

టిమ్ కుక్ జీతంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పనితీరు ఆధారిత షేర్లను 2023లో 50 శాతం నుంచి 75 శాతానికి పెంచారు.ఈ ట్రెండ్ 2023లోనే కాకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని అంచనా. 2022లో, టిమ్ కుక్ $99.4 మిలియన్ల జీతం సంపాదించాడు. ఇందులో మూల వేతనంలో $3 మిలియన్లు, స్టాక్‌లో $83 మిలియన్లు ఉన్నాయి. 2021లో, టిమ్ కుక్ సుమారు $98.7 మిలియన్ల విలువైన షేర్లను కలిగి ఉన్నారు.

75 శాతానికి

75 శాతానికి

ప్రస్తుత నిర్ణయాల ప్రకారం, ఆపిల్ మేనేజ్‌మెంట్ నిర్దేశించిన లక్ష్యాన్ని బట్టి అతనికి వాటా ఇచ్చారు. గతంలో కంపెనీ లక్ష్యం 50 శాతానికి చేరుకుంటే $ 83 మిలియన్ల షేర్లు ఇచ్చారు. ఇప్పుడు అంటే 2023 నుంచి టార్గెట్ 75 శాతానికి చేరుకుంటేనే షేర్లు ఇస్తారు. గూగుల్ సుందర్ పిచాయ్‌కి కూడా ఇదే లక్ష్యాన్ని నిర్దేశించారు.

English summary

Salary Cutting: ఉద్యోగులను తొలగించడమే కాదు.. జీతాలు కూడా తగ్గిస్తున్న ఐటీ కంపెనీలు.. | IT companies are not only laying off employees.. they are also reducing the salaries of CEOs

IT companies are not only laying off employees.. they are also reducing the salaries of CEOs. Alphabet, Apple cut salaries of their CEOs.
Story first published: Friday, January 13, 2023, 11:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X