For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFCలో చైనా సెంట్రల్ బ్యాంకు పెట్టుబడులు భారీ డీలేనా? ఇవి చూడండి...

|

ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC లిమిటెడ్‌లో 1.75 కోట్ల షేర్ల (1%)ను చైనా సెంట్రల్ బ్యాంకు కొనుగోలు చేసింది. జనవరి - మార్చి క్వార్టర్‌లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ వాటాలను కొనుగోలు చేసింది. చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంకు ఆఫ్ చైనా HDFC లిమిటెడ్‌లో తన వాటాను పెంచుకుంది. HDFC లిమిటెడ్‌లో చైనా బ్యాంకుకు 17.5 మిలియన్ల షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్ క్యాపిటల్‌లో ఇది 1.01 శాతానికి సమానం. గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్‌లో ఎల్ఐసీ తమ వాటాను 4.21% నుంచి 4.67% పెంచుకుంది.

<strong>అదను చూసి HDFC షేర్లు కొనుగోలు చేసిన చైనా బ్యాంకు, ఇండియన్స్ ఆందోళన!!</strong>అదను చూసి HDFC షేర్లు కొనుగోలు చేసిన చైనా బ్యాంకు, ఇండియన్స్ ఆందోళన!!

చైనా బ్యాంకు పెట్టుబడులు

చైనా బ్యాంకు పెట్టుబడులు

విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడిదారులు (FPI) ఎప్పుడు భారతీయ సంస్థలలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా... HDFCలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇతర దేశాల ప్రభుత్వ యాజమాన్యాల సంస్థల పెట్టుబడులను ఎఫ్పుడూ విదేశీ సంస్థాగత పెట్టుబడులుగానే గుర్తించబడ్డాయి.

ఐసీఐసీఐలో పెట్టుబడులు

ఐసీఐసీఐలో పెట్టుబడులు

ICICI బ్యాంకును తీసుకుంటే ఇందులో అతిపెద్ద రెండో ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్ (FPI) సింగపూర్ ప్రభుత్వానిది. డిసెంబర్ 31, 2019 వరకు అందిన డేటా ప్రకారం 2 శాతానికి పైగా వాటు ఉంది. అలాగే అబుదబీ ప్రభుత్వానికి చెందిన అబుదబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కూడా ఇన్వెస్ట్ చేసింది.

ICICIలో FPIలు 45.79 శాతం

ICICIలో FPIలు 45.79 శాతం

ఐసీఐసీఐలో 45.79 శాతం పెట్టుబడులు ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్‌కు చెందినవి. ఇందులో డోడ్జ్ అండ్ కాక్స్ ఇంటర్నేషనల్ స్టాక్ ఫండ్ 4.11 శాతం, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ 2.09 శాతం, అబుదబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 1.07 శాతం ఇన్వెస్ట్ చేసింది.

HDFC బ్యాంకులో..

HDFC బ్యాంకులో..

అలాగే HDFC, HDFC బ్యాంకు విషయానికి వస్తే 37.92 శాతం ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్ ఉంది. HDFC బ్యాంకులో యూరో పసిఫిక్ గ్రోత్ ఫండ్ 4.76 శాతం, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ 1.27 శాతం ఉంది.

ఎవరి కంట్రోల్‌లో..

ఎవరి కంట్రోల్‌లో..

ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్(FPI), నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (NRI), పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (PIOs) పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీం (PIS) ద్వారా భారత ప్రైమరీ, సెకండరీ క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డర్స్ సరళిని పరిశీలిస్తుంది. పోర్ట్ పోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీం కింద FPIలు, NRIలు ఇండియన్ స్టాక్ మార్కెట్ల ద్వారా ఇండియన్ కంపెనీలలో వాటాలు, డిబెంచర్లు పొందవచ్చు. కాగా, 2019 డిసెంబర్ నాటికి HDFC బ్యాంకులో FPI వాటా 72 శాతంగా ఉందని, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటా పెద్ద విషయం కాదనే వారు కూడా ఉన్నారు.

English summary

HDFCలో చైనా సెంట్రల్ బ్యాంకు పెట్టుబడులు భారీ డీలేనా? ఇవి చూడండి... | Is The Chinese Central Bank Stake In HDFC Such A Big Deal?

Slowly and gradually, investors, analysts and even politicians are beginning to question the more than 1 per cent shareholding that People's Bank of China (PBOC) has picked in HDFC.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X