For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనిల్ అంబానీకి షాక్: 15నుంచి రిలయన్స్ హెల్త్ పాలసీలు అమ్మొద్దు

|

న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్ ఆర్థికస్థితి బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఆ కంపెనీ మార్కెట్లో పాలసీలు విక్రయించడాన్ని IRDAI నిషేధించింది. కంపెనీ ఆస్తులతో పాటు పాలసీదారులపై గల బాధ్యతలను రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్‌కు బదలీ చేయాలని తెలిపింది. ప్రస్తుత పాలసీదారుల క్లెయిమ్స్ అన్నింటిని ఆ కంపెనీ చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రిలయన్స్ హెల్త్ సాల్వెన్సీ మార్జిన్ మెరుగుపడే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవని, అందుకే వ్యాపార కార్యకలాపాలు జరిపితే పాలసీదారులు నష్టపోతారని చెబుతోంది.

దేవుడే వచ్చి చెప్పినా ఇన్ఫోసిస్ లెక్క అంతే: నందన్ నీలేకనిదేవుడే వచ్చి చెప్పినా ఇన్ఫోసిస్ లెక్క అంతే: నందన్ నీలేకని

నవంబర్ 15 నుంచి ఇన్సురెన్స్ వ్యాపారం వద్దు

నవంబర్ 15 నుంచి ఇన్సురెన్స్ వ్యాపారం వద్దు

2019 నవంబర్ 15వ తేదీ నుంచి బీమా వ్యాపారం అండర్ రైటింగ్‌ను నిలిపివేయాలని రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్‌కు IRDAI తెలిపింది. పాలసీలు విక్రయించవద్దని ఆంక్షలు విధించింది.కంపెనీ ఆర్థిక పరిస్థితి నిర్ణీత ప్రమాణాల కంటే బలహీనంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. పాలసీదారులకు చెందిన డబ్బులు, ఇతరత్రా ఆర్థికపరమైన ఆస్తులను రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీలిమిటెడ్‌కు బదలీ చేయాలని సూచించింది. దీంతో ప్రస్తుత పాలసీదారులకు క్లెయిమ్స్ చెల్లించే పరిస్థితి ఉంటుందని తెలిపింది.

ఆర్థిక సామర్థ్యం లేనందునే...

ఆర్థిక సామర్థ్యం లేనందునే...

క్లెయిమ్స్ సహా ఇతరత్రా వాటికి చెల్లించేందుకు అవసరమైన ఆర్థిక సామర్థ్యం నిర్ణీత ప్రమాణాల కంటే తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్ ఆరోగ్య బీమా వ్యాపారాన్ని కొనసాగిస్తే పాలసీదార్ల ప్రయోజనాలు సురక్షితం కాదని పేర్కొంది. అందుకే ఈ నెల 15వ తేదీ నుంచి ఇన్సురెన్స్ వ్యాపారం నిలిపివేయాలని సూచించింది.

ఆస్తుల జోలికి వెళ్లవద్దు..

ఆస్తుల జోలికి వెళ్లవద్దు..

ఈ విషయాన్ని కంపెనీ వెబ్ సైట్‌లో, శాఖల్లో ఈ విషయం కనిపించేలా ఉంచాలని IRDAI తెలిపింది. మిగిలి ఉన్న ఆస్తుల జోలికి వెళ్లకూడదని, నియంత్రణ సంస్థ నుంచి లిఖిత పూర్వక అనుమతి లేకుండా వాటిని విక్రయించవద్దని తెలిపింది. అదే సమయంలో రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్ ఆస్తులు, అప్పులు సాధారణ ఇన్సురెన్స్ వ్యాపారం నుంచి వేరుగా ఉంచాలని రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్‌కు సూచించింది.

English summary

అనిల్ అంబానీకి షాక్: 15నుంచి రిలయన్స్ హెల్త్ పాలసీలు అమ్మొద్దు | Irdai directs Reliance Health Insurance to stop selling new policies

The Insurance Regulatory and Development Authority of India (IRDAI) has directed Reliance Health Insurance to stop selling new products and transfer its liabilities to Reliance General Insurance, with effect from November 15.
Story first published: Friday, November 8, 2019, 9:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X