For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిస్కౌంట్ ఆరోగ్య పథకాలపై జాగ్రత్త: IRDAI

|

అనధికార సంస్థలు డిస్కౌంట్ల పైన హెల్త్ ఇన్సురెన్స్ స్కీమ్స్ అందిస్తున్నట్లు తేలడంతో ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDAI ప్రజలను హెచ్చరించింది. కొన్ని అనధికారిక సంస్థలు డయోగ్నస్టిక్ టెస్ట్ కోసం, మెడికల్ ట్రీట్మెంట్ కోసం హెల్త్ ప్లాన్స్‌ను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తెలిపింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. IRDAI వద్ద రిజిస్టర్ అయిన ఇన్సురెన్స్ కంపెనీలు లేదా అధీకృత ఏజెంట్స్ ఉత్పత్తులు విక్రయిస్తాయని తెలిపింది.

అనధికార వ్యక్తులు లేదా సంస్థల నుండి డిస్కౌంట్ పైన హెల్త్ ఇన్సురెన్స్ కొనుగోలు చేస్తే అది వారి సొంత రిస్క్ అని తెలిపింది. IRDAI గుర్తించిన బీమా సంస్థల జాబితా వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇంకా సందేహాలు ఉంటే వినియోగదారులు బీమా కంపెనీలను సంప్రదించి, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించింది. వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్ పేరుతో వీరు చెప్పే మాటలను ఏమాత్రం నమ్మవద్దని సూచించింది.

IRDAI cautions against unauthorised entities selling health plans

కొన్ని సంస్థలు, కొంత మంది వ్యక్తులు అనధికారికంగా వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్స్ పేరుతో హెల్త్ పాలసీలు మార్కెట్‌ చేస్తున్నట్టు తెలియడంతో IRDAI ఈ ప్రకటన విడుదల చేసింది.

English summary

డిస్కౌంట్ ఆరోగ్య పథకాలపై జాగ్రత్త: IRDAI | IRDAI cautions against unauthorised entities selling health plans

Insurance regulator IRDAI on Tuesday cautioned people against unauthorised entities professing to be selling health plans by offering discounts on medical treatments.
Story first published: Wednesday, October 7, 2020, 20:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X