For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కూలుతున్న మార్కెట్లు, రెండ్రోజుల్లో రూ.9.74 లక్షల కోట్ల సంపద మటాష్

|

భారత స్టాక్ మార్కెట్లు రోజురోజుకు కుప్పకూలుతున్నాయి. బుధవారం కూడా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోతున్నారు. ఇప్పటికే సోమ, మంగళవారాల్లో మార్కెట్లు కుప్పకూలడంతో రూ.9.74 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బుధవారం మరిన్ని లక్షల కోట్లు కోల్పోయారు. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఎమర్జెన్సీ రేట్‌కట్‌కు ఆర్బీఐ దూరం,43 దేశాలు యూఎస్ ఫెడ్ దారిఎమర్జెన్సీ రేట్‌కట్‌కు ఆర్బీఐ దూరం,43 దేశాలు యూఎస్ ఫెడ్ దారి

అమెరికా మాంద్యం దెబ్బ

అమెరికా మాంద్యం దెబ్బ

స్టాక్ మార్కెట్లు నిన్న ప్రారంభంలో లాభాలతో ప్రారంభమై మధ్యాహ్నం వరకు అదే జోష్‌ను కనబరిచినప్పటికీ, చివరి గంటలో అమ్మకాల ఒత్తిళ్లకు లోనయ్యాయి. దీంతో భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నిలకడగా సాగినప్పటికీ అమెరికా మాంద్యంలోకి జారుకోవచ్చనే వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు చివరి గంటలో అమ్మకాలకు దిగారు. 2017 మార్చి తర్వాత నిఫ్టీ 9000 పాయింట్ల దిగువన ముగియటం మళ్లీ ఇప్పుడే.

రూ.9.74 లక్షల కోట్లు ఆవిరి..

రూ.9.74 లక్షల కోట్లు ఆవిరి..

సోమ, మంగళ వారాల్లో మార్కెట్ నష్టాల దెబ్బకు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.9.74 లక్షల కోట్లు (రూ.9,74,176.71 కోట్లు) ఆవిరైంది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ మంగళవారం ముగింపు సమయానికి రూ.1,19,52,066.11 కోట్లకు తగ్గింది. మార్కెట్ ప్రారంభంలో పెట్టుబడిదారులు విలువ ఆధారిత కొనుగోళ్లకు మొగ్గు చూపటంతో లాభాల్లో సాగాయి. కానీ మాంద్యం భయాలతో చివరి గంటలో ఒత్తిళ్లకు గురయ్యాయి.

52 వారాల గరిష్టానికి రెండు షేర్లు మాత్రమే..

52 వారాల గరిష్టానికి రెండు షేర్లు మాత్రమే..

బుధవారం కూడా మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లడంతో ఎన్ఎస్ఈలో 334 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. ఎన్ఎస్ఈలో కేవలం 2 షేర్లు మాత్రమే 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఇందులో బఫ్నా ఫార్మాస్యూటికల్స్, రుచీ సోయా ఉన్నాయి.

English summary

కూలుతున్న మార్కెట్లు, రెండ్రోజుల్లో రూ.9.74 లక్షల కోట్ల సంపద మటాష్ | Investor wealth tumbles Rs 9.74 lakh crore in two days

Investors' wealth dropped by Rs 9.74 lakh crore in two days of market fall this week triggered by weak global trends and fears of coronavirus hitting the overall economy.
Story first published: Wednesday, March 18, 2020, 15:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X