For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mutual Funds: నెలకు రూ.3000తో మూడు కోట్లు సంపాదించవచ్చు.. !

|

దాదాపు అందరికీ జీవితంలో బాగా స్థిరపడాలని ఉంటుంది. కానీ ఆ దిశ ప్రయాణించేవారు చాలా తక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం చేసేవారు సరైన ప్రణాళిక లేక వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు పడతారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవద్దంటే కనీసం 25 సంవత్సరాల వయసులో పెట్టుబడులను ప్రారంభించాలని నిపుణులు చూసిస్తున్నారు. దాదాపు చాలా మంది 23 ఏళ్ల నుంచి 30 మధ్యలో ఉద్యోగం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో చేరిన కొత్త‌లో పెట్టుబ‌డులు చేసేందుకు మ‌న వ‌ద్ద అధిక మొత్తంలో డ‌బ్బు ఉండ‌దు. అలాగ‌ని మ‌దుపు చేయ‌డం మానేస్తే స‌రైన స‌మ‌యానికి ల‌క్ష్యాన్ని చేరుకోలేమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్ర‌తీ నెలా మ‌న‌కు వీలైనంత డ‌బ్బును ఆదా చేసి మ్యూచువల్ ఫండ్లలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్ ) ద్వారా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్ సిప్ ద్వారా దీర్ఘకాలంలో 12 నుంచి 15 శాతం రిటర్న్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే కేవలం సిప్ చేయడం ద్వారా మాత్రమే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని చేరుకోలేరని వివరిస్తున్నారు. ప్రతీ సంవత్సరం పెట్టుబడులను పెంచుతుండాలని సూచిస్తున్నారు. ఎవరైనా తమ పెట్టుబడిలో వార్షిక స్టెప్-అప్ 10 శాతం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వ్యక్తి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. దీంతోపాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. అలా అని పెట్టుబడులు తగ్గించ్చొద్దు. ఎక్కువ కాలం పెట్టుబడులలో నెలవారి సిప్, వార్షిక స్టెప్-అప్‌లు మదుపర్ల పెట్టుబడులపై గరిష్ఠ కాంపౌండింగ్ ప్రయోజనాన్ని ఇస్తాయి.

To build a corpus of ₹3 crores in 35 years, you would need to save and invest close to ₹3000 for month and increase annually

అయితే ఇక్కడ మీరు ఎంచుకునే మ్యూచువల్ ఫండ్ పై రాబడి ఆధారపడి ఉంటుంది. అందుకే నిపుణులను సంప్రదించి ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిది. సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబ‌డులు చేసే వారికి ముఖ్యంగా ఉండాల్సింది ఆర్థిక క్రమశిక్షణ, స‌రైన ప్ర‌ణాళిక‌. ఈ రెండు ఉంటే పెద్ద ల‌క్ష్యాన్ని అయినా సుల‌భంగా చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

English summary

Mutual Funds: నెలకు రూ.3000తో మూడు కోట్లు సంపాదించవచ్చు.. ! | Invest 3000 rupees for month get 3 Crors

To build a corpus of ₹3 crores in 35 years, you would need to save and invest close to ₹3000 for month and increase annually
Story first published: Saturday, July 2, 2022, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X