For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Travel Alert: నేరస్తులు ఇకపై దేశం దాటడం కష్టమే.. కేంద్రం కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి..

|

International Travellers ALERT: ఇకపై ఆర్థిక నేరగాళ్లు, క్రిమినల్స్ దేశం నుంచి తప్పించుకోవటం కుదరదు. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని విమాన కంపెనీలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా నేరాలను నిరోధించడం, గుర్తించడం, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ చేయటం సులభతరం కానుందని తెలుస్తోంది.

 నేరగాళ్లు తప్పించుకోకుండా..

నేరగాళ్లు తప్పించుకోకుండా..

విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి ఆర్థిక నేరగాళ్లు మౌనంగా దేశం విడిచి పారిపోవటం ఇకపై అస్సలు కుదరదు. వీరు దేశంలోని బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను మోసం చేసి ఎగ్గొట్టారు. ప్రస్తుతం విదేశాల్లో విలాసవంతంగా జీవిస్తున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.

జరగకుండా నివారించేందుకు..

జరగకుండా నివారించేందుకు..

భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా.. విమానాలు బయలుదేరడానికి 24 గంటల ముందు కస్టమ్స్ అధికారులతో అన్ని అంతర్జాతీయ ప్రయాణీకుల వివరాలను తప్పక అందించాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను ఆదేశించింది. నేరస్తులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్.. సోమవారం 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్స్, 2022' పేరుతో గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

రీసెర్చ్ చేసేందుకు..

రీసెర్చ్ చేసేందుకు..

కొత్త చట్టం ప్రకారం నేరస్తులు తప్పించుకోకుండా నిరోధించటానికి ఈ డేటాను ఉపయోగించుకోనుంది. ప్రయాణికుల సమాచారాన్ని ముందుగా విశ్లేషించటం ద్వారా కీలక కేసుల్లో నేరస్తులు తప్పించుకోకుండా ఈ చర్యలు సహకరిస్తాయి. దీనితో పాటు.. స్మగ్లింగ్ వంటి ఏదైనా అక్రమ వ్యాపారాన్ని నిరోధించడంలో ఈ నిబంధన సహాయపడుతుందని తెలుస్తోంది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. "ప్రతి ఎయిర్ ఆపరేటర్ ప్రయాణీకుల పేర్లు, ఇతర రికార్డుల గురించి కస్టమ్స్ విభాగానికి తెలియజేయాలి." సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఈ సమాచారాన్ని ఇప్పటికే ఆపరేటర్లు సేకరిస్తుంటారు. కాబట్టి ఇది షేర్ చేయటం చాలా సులువు కూడా.

 ప్రక్రియ ఏమిటంటే..

ప్రక్రియ ఏమిటంటే..

ప్రభుత్వ సూచనల అమలు కోసం ప్రతి ఎయిర్‌లైన్ ఆపరేటర్ కస్టమ్స్‌లో నమోదు చేసుకోవాలని గెజిట్ నేటిఫికేషన్ పేర్కొంది. విమానయాన సంస్థలు దేశం నుంచి బయటకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణీకుల సమాచారాన్ని అందించాలి. ఈ సమాచారంలో ప్రయాణికుడి పేరు, బిల్లింగ్ చెల్లింపు సమాచారం (క్రెడిట్ కార్డ్ నంబర్), టికెట్ జారీ చేసిన తేదీతో పాటు అదే PNR టిక్కెట్‌పై ప్రయాణించే ఇతరుల వ్యక్తుల పేర్లతో కూడిన వివరాలు ఉంటాయి.

English summary

Travel Alert: నేరస్తులు ఇకపై దేశం దాటడం కష్టమే.. కేంద్రం కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి.. | International travellers ALERT! Airlines asked to share passengers' information flying abroad

central government asked Airlines to share passengers' information flying abroad 24 hours prior
Story first published: Wednesday, August 10, 2022, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X