For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేట్లు తగ్గించిన కెనరా బ్యాంకు, ఎంత తగ్గాయంటే?

|

పబ్లిక్ సెక్టార్ రంగ కెనరా బ్యాంకు గురువారం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (MCLR)ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రుణాలపై అన్ని కాలపరిమితులపై MCLR తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది.

బిల్లు తీసుకుంటే రూ.1 కోటి వరకు గెలిచే ఛాన్స్బిల్లు తీసుకుంటే రూ.1 కోటి వరకు గెలిచే ఛాన్స్

కెనరా బ్యాంకు MCLRను 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. తాజా తగ్గింపుతో ఓవర్ నైట్ MCLR 7.65 శాతం, నెల రోజుల కాలపరిమితి గల రుణాలపై వడ్డీ రేటు 7.65 శాతం, మూడు నెలల వ్యవధితో కూడిన వడ్డీ రేటు 7.95 శాతం, ఆరు నెలల కాల వ్యవధి కలిగిన రుణాలపై వడ్డీ రేటు 8.10 శాతం, ఏడాది కాలపరిమితి గల రుణాలపై వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంటాయి.

Interest Rate: Canara Bank cuts lending rates

కాగా రిటైల్ రుణాలకు సంబంధించి రెపో రేటు అనుసంధానిత రుణ రేటు (RLLR), MSMEలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుందని పేర్కొంది.

కాగా, RBI రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో రెపో రేటు (బ్యాంకులకు వర్తించే స్వల్పకాలిక వడ్డీ రేటు) 5.15 శాతం వద్ద యథాతథంగా ఉంది. ద్రవ్యోల్బణం ఇటీవల కాలంలో ఎగువకు కదులుతున్నప్పటికీ ఆర్థిక వృద్ధిరేటులో భారీ క్షీణత కారణంగా ఆర్బీఐ ఈ రెపో రేటులో మార్పులు చేయలేదు. వృద్ధికి ఊతమిచ్చేందుకు భవిష్యత్తులో మరింతగా రేట్లు తగ్గించడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది.

English summary

వడ్డీ రేట్లు తగ్గించిన కెనరా బ్యాంకు, ఎంత తగ్గాయంటే? | Interest Rate: Canara Bank cuts lending rates

Public sector lender Canara Bank on Thursday announced that it has reduced its Marginal Cost of Funds based Lending Rates (MCLR) on loans and advances across all tenors with effect from February 7.
Story first published: Friday, February 7, 2020, 8:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X