For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్ 1.74 బిలియన్ డాలర్ల భారీ డీల్స్, కొత్తగా 20,000 ఉద్యోగాలు

|

ఇండియన్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. నెట్ ప్రాఫిట్‌లో ఏడాది ప్రాతిపదికన జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 11.1శాతం వృద్ధిని నమోదు చేసి రూ.4,233 కోట్లగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.3,798 కోట్లుగా ఉంది. ఈ వృద్ధి రేటు రూ.3,280 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు భావించారు. కానీ అంచనాలను మించింది. ఇక మొత్తం ఆదాయం రూ.21,803 కోట్ల నుండి 8.5 శాతం పెరిగి రూ.23,665 కోట్లకు చేరుకుంది.

Covid 19: ఇదీ TCS ధీమా.. ఈ ఏడాది మరో 40,000 కొత్త ఉద్యోగాలుCovid 19: ఇదీ TCS ధీమా.. ఈ ఏడాది మరో 40,000 కొత్త ఉద్యోగాలు

కరోనా సమయంలో భారీ ఒప్పందాలు

కరోనా సమయంలో భారీ ఒప్పందాలు

కరోనా మహమ్మారి ప్రభావం ఇన్ఫోసిస్ పైన పడింది. మార్చిలో భారతీయ ఐటీ కంపెనీలపై కొంత ప్రభావమే చూపినప్పటికీ, జూన్ నాటికి అధికమైంది. ఈ కాలంలో ఇన్ఫోసిస్‌కు భారీ ఆర్డర్లు దన్నుగా నిలిచాయి. తొలి క్వార్టర్‌లో 1.74 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందాలు కుదిరినట్లు తెలిపింది. డిజిటల్ ఆదాయం 25 శాతం పెరిగి 1.38 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా డాలర్ ప్రాతిపదికన చూస్తే నికర లాభం 3.1 శాతం పెరిగి 564 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆదాయం మాత్రం గత ఏడాదితో పోలిస్తే 0.3 శాతం తగ్గింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 1.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020-21లో స్థిర మారకంలో ఆదాయం 2 శాతం పెరుగుతుందని అంచనా. ఆదాయం, నికర లాభంతో పాటు జూన్ క్వార్టర్‌లో ఒక్కో వాటాపై ఆర్జించే ఈపీఎస్‌ను కంపెనీ రూ.9.98కు పెంచుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13.1 శాతం ఎక్కువ. అయితే మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం, జూన్‌ త్రైమాసికంలో ఈపీఎస్ రెండు శాతం తక్కువ.

ట్రంప్ నిర్ణయంపై...

ట్రంప్ నిర్ణయంపై...

జూన్ క్వార్టర్ నాటికి ఇన్ఫీలో 2,39,233 మంది ఉద్యోగులు ఉన్నారు. వలసల శాతం 11.7 శాతంగా ఉంది. హెచ్1బీ వీసాలను రద్దు చేయడం అర్థరహితమని ఇన్ఫోసిస్ అభిప్రాయపడింది. స్థానిక నియామకాలపై తాము మరింతగా దృష్టి సారించామని, కార్యకలాపాలపై వీసాల రద్దు ప్రభావం ఉండదని తెలిపింది. టీసీఎస్, విప్రోలు కూడా హెచ్1బీ వీసాల రద్దు నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డాయి.

20,000 కొత్త ఉద్యోగాలు

20,000 కొత్త ఉద్యోగాలు

ఉద్యోగ ఆఫర్‌లు అందుకున్న 90 శాతం మంది ఇప్పటికే ఉద్యోగంలో చేరారని, మిగిలిన వారు ఈ క్వార్టర్‌లో చేరనున్నట్లు తెలిపింది ఇన్ఫీ. ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అక్టోబర్ తర్వాత దశలవారీగా తీసుకుంటామని వెల్లడించింది. వీరికి తోడు ఐటీ సేవల్లో అనుభవం ఉన్న వారికి ఇచ్చిన జాబ్స్ ఆఫర్స్‌లో 90 శాతం మంది ఇప్పటికే చేరినట్లు తెలిపింది. దీంతో జూన్ 2020 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,39,233 చేరుకుంది.

English summary

ఇన్ఫోసిస్ 1.74 బిలియన్ డాలర్ల భారీ డీల్స్, కొత్తగా 20,000 ఉద్యోగాలు | Infosys Q1 Results: Profit rises 12% to Rs 4,233 crore

Infosys on Wednesday posted a 11.5 per cent year-on-year (YoY) growth in net profit at Rs 4,233 crore for the quarter ended June 30. It had reported a net profit of Rs 3,798 crore in the corresponding quarter last year.
Story first published: Thursday, July 16, 2020, 8:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X