For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింగపూర్ బెటర్ అంటున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. అసలు ఈ కామెంట్స్ ఎందుకంటే..?

|

కంపెనీ కార్యకలాపాల్లో వ్యవస్థాపకులు ప్రమోటర్ల కుటుంబ సభ్యులను అనుమతించకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పిదమని భారత ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కొద్దిరోజుల క్రితం సంచలన కామెంట్స్ చేశారు. దీని తర్వాత ఇప్పుడు మరో సంచలన కామెంట్స్ చేశారు.

 విద్యార్థులతో మాట్లాడుతూ..

విద్యార్థులతో మాట్లాడుతూ..

జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరైన నారాయణమూర్తి మాట్లాడుతూ భారతదేశంలో అవినీతి, మురికి రోడ్లు, కాలుష్యం ఉన్నాయని అన్నారు. కానీ సింగపూర్‌లో అలా ఉండదన్న ఆయన.. శుభ్రమైన రోడ్లు, కాలుష్య రహితంగా ఉంటుందని అన్నారు. అయితే విద్యార్థులు నాయకుడిలా ఆలోచించాలని.. మరొకరు ఆ స్థానాన్ని ఆక్రమించే వరకు వేచి ఉండకూడదని సూచించారు.

వాస్తవం ఏమిటి..

వాస్తవం ఏమిటి..

దేశంలో వాస్తవానికి అవినీతి, మురికి రోడ్లు, కాలుష్యం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ సింగపూర్‌లో స్వచ్ఛమైన రోడ్లు, విద్యుత్ చాలా ముఖ్యమైనవి. సమాజంలో మార్పు తీసుకురావడానికి యువత మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. సంక్షేమం కంటే సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించాలని సూచించారు.

 స్పూర్తి పొందండి..

స్పూర్తి పొందండి..

విద్యార్థులు జీఎంఆర్ రవిని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలన్నారు. పారిశ్రామికవేత్తగా మారి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. పేదరిక నిర్మూలనకు ఏకైక మార్గం మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడమేనని అభిప్రాయపడ్డారు. పేదరికంలో ఉన్నవారికి సహాయం చేసే మార్గం కూడా ఇదేనని అన్నారు.

ఇన్ఫోసిస్ ప్రయాణం..

ఇన్ఫోసిస్ ప్రయాణం..

ఇన్ఫోసిస్ కొద్ది రోజుల కిందట తన 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అందులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఎవరైనా జీవించగలిగే సామర్థ్యం ఉన్నట్లయితే, తన జాతీయత, వారసత్వం, ఎవరి బిడ్డ అని ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.

English summary

సింగపూర్ బెటర్ అంటున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. అసలు ఈ కామెంట్స్ ఎందుకంటే..? | Infosys Narayana Murthy comments on indian corruption, roads, pollution

Infosys Narayana Murthy comments on indian corruption, roads, pollution
Story first published: Monday, December 19, 2022, 15:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X