రూ. 32,403 కోట్ల కేసులో ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట..జీఎస్టీ నోటీసును రద్దు చేసిన DGGI
దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కు జీఎస్టీ కేసులో భారీ ఊరట లభించింది. రూ. 32,403 కోట్ల జీఎస్టీ నోటీసును రద్దు చేస్తూ DGGI కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) నుండి ఈ రద్దు నోటీసు అందిందని టెక్ దిగ్గజం ఓ ప్రకటనలో తెలిపింది. 2018-19 నుండి 2021-22 ఆర్థిక సంవత్సరాలకు గానూ కంపెనీపై ప్రీ-షో కాజ్ నోటీసు ప్రొసీడింగ్స్ మూసివేసినట్లు నోటీసుల్లో DGGI తెలిపింది.ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ తెలిపింది.
కాగా గత ఏడాది జూలైలో కర్ణాటక జీఎస్టీ అధికారులు ఇన్పో కంపెనీకి జూలై 2017 నుండి రూ.32,403 కోట్ల నోటీసు పంపిన తర్వాత ఈ క్లోజర్ రిపోర్ట్ వచ్చింది. మార్చి 2022 వరకు దాని విదేశీ శాఖల నుండి దిగుమతి చేసుకున్న సేవలకు రిజర్వ్-ఛార్జ్ మెకానిజం కింద జీఎస్టీ చెల్లించనందుకు కంపెనీకి ఈ నోటీసు వచ్చింది.

ఇక ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో..ఇంటర్వ్యూలలో పాల్గొనే సీనియర్ ఉద్యోగులకు నగదు బహుమతి అందించే విధానాన్ని ఇన్ఫోసిస్ ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఉద్యోగులు.. అభ్యర్థులకు నిర్వహించే ప్రతి ఇంటర్వ్యూకు 700 పాయింట్లు (రూ.700) అందుకుంటారు. జనవరి 1 నుండి ఈ నగదు కార్యక్రమం అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. దీంతో పాటుగా గత ఐదు నెలలుగా నిర్వహించిన ఇంటర్వ్యూలకు కూడా నగదు అందుకోవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈటీ నివేదిక ప్రకారం.. ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయడం కంపెనీ ఇదే తొలిసారి. అయితే ఈ నగదు ప్రోత్సహ కార్యక్రమం విదేశాలకు వర్తించదు. భారతదేశంలో చేసే నియామకాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంటర్యూ సమయంలో ఉద్యోగులు పోషించే పాత్రను ఈ నగదు కార్యక్రమం గుర్తిస్తుందని కంపెనీ తెలిపింది. దేశంలో రెండో టెక్ దిగ్గజం క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కంటే నేరుగా నియామకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
ఇన్పోసిస్ ఇంటర్యూలకు వెళ్లే అభ్యర్థులు పలు రౌండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. HR రౌండ్‌కు వెళ్లే ముందు జాబ్ లెవల్ 5,6లలో ట్రాక్ లీడ్‌లు, ఆర్కిటెక్ట్‌లు, ప్రాజెక్ట్ మేనేజర్‌ల వంటి అనుభవజ్ఞులైన టెక్ నిపుణులతో ఇంటర్యూను అభ్యర్థులు ఎదుర్కోవాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులతో సీనియర్లు ఈ ఇంటర్యూ నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2025లో ఇప్పటివరకు 800 మంది ట్రైనీ ఉద్యోగులను తొలగించింది. వారు ఇంటర్నల్ టెస్టులో పాస్ కాకపోవడంతో ఇంటికి సాగనంపింది. 680 మంది అభ్యర్థుల బ్యాచ్ నుండి దాదాపు 195 మందిని బయటకు పంపింది. ఏప్రిల్‌లో సుమారు 240 మంది ఉద్యోగులను తొలగించింది. గతేడాది ఫిబ్రవరిలో 300 మందికి పైగా ట్రైయినీలను.. మార్చిలో అదనంగా 30-35 మందిని తొలగించింది.