For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ పన్నుల ఎగవేత: ఇన్ఫోసిస్‌కు కాలిఫోర్నియా షాక్, రూ.56 కోట్ల జరిమానా

|

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో షాక్. కాలిఫోర్నియా (అమెరికా)లోని రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది. విదేశీ వర్కర్స్, ట్యాక్స్ ఫ్రాడ్‌కు సంబంధించిన మిస్‌క్లాసిఫికేషన్ అంశంలో 8,00,000 డాలర్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.56 కోట్లు. ఈ మేరకు జరిమానా విధించినట్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెకెరా ఓ ప్రకటనలో తెలిపారు.

మరో షాక్.. ఇన్ఫోసిస్‌లో నష్టపోయారా, ఇక్కడ కలవండి: అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా!మరో షాక్.. ఇన్ఫోసిస్‌లో నష్టపోయారా, ఇక్కడ కలవండి: అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా!

వీసా నిబంధనల ఉల్లంఘన

వీసా నిబంధనల ఉల్లంఘన

ఇన్ఫోసిస్ ఔట్ సోర్సింగ్ సర్వీసులను నిర్వర్తించడంలో భాగంగా వీసా నిబంధనలను అతిక్రమిస్తోందని అమెరికాలో గతంలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. సంస్థపై అమెరికాలో అనేక పరిమితులు ఉన్నాయి. దీంతో 2006-2017 మధ్య కాలంలో భారత్ నుంచి తన ఉద్యోగులను బిజినెస్ వీసాలతో కాలిఫోర్నియాకు తీసుకు వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ సర్వీసుల కోసం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను H1B వీసాలకు బదులు బిజినెస్ వీసాలు B1 కింద తీసుకువచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు

ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు

వీసాల నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా వివిధ రకాల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తెలిపారు. సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి ఇచ్చిన సమాచారం ఆధారంగా దీనిపై విచారణ జరిపారు. ఈ క్రమంలో కాలిఫోర్నియా ప్రభుత్వంతో నవంబర్ నెలలో ఇన్ఫోసిస్ ఒప్పందం కుదుర్చుకుంది. జరిమానా చెల్లించేందుకు అంగీకరించిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. 2017లో కూడా ఇదే ఆరోపణలపై న్యూయార్క్ ప్రభుత్వానికి ఒక మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది.

500 మంది ఉద్యోగుల ట్యాక్స్...

500 మంది ఉద్యోగుల ట్యాక్స్...

ఇన్ఫోసిస్ స్పాన్సర్డ్ B1 వీసాలపై 2006-2017 మధ్య దాదాపు 500 వరకు ఉద్యోగులు కాలిఫోర్నియాకు వచ్చారని తెలుస్తోంది. వీసా నిబంధనల ఉల్లంఘన ద్వారా ఇన్ఫోసిస్ కాలిఫోర్నియా పేరోల్ ట్యాక్సులను ఎగ్గొట్టినట్లు చెబుతున్నారు. అన్‌ఎంప్లాయిమెంట్ ఇన్సురెన్స్, డిజబులిటీ ఇన్సురెన్స్, ఎంప్లాయిమెంట్ ట్రెయినింగ్ ట్యాక్స్ వంటివి చెల్లించలేదు.

English summary

వివిధ పన్నుల ఎగవేత: ఇన్ఫోసిస్‌కు కాలిఫోర్నియా షాక్, రూ.56 కోట్ల జరిమానా | Infosys fined $800,000 for worker misclassification, tax fraud in US

Infosys has agreed to pay $800,000 to settle allegations of misclassification of foreign workers and tax fraud, officials announced Tuesday.
Story first published: Wednesday, December 18, 2019, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X